పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) వివరణ ఇచ్చారు. తాను ఎవరి తండ్రిని, తాతను కించ పరచలేదని మోడీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అన్న వ్యాఖ్యలనే తాను చెప్పానని.. అప్పటి పరిస్ధితులను, ఇప్పటి పరిస్ధితులను వివరించే ప్రయత్నం చేశానని ఆయన చెప్పారు.
పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) వివరణ ఇచ్చారు. తాను ఎవరి తండ్రిని, తాతను కించ పరచలేదని మోడీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అన్న వ్యాఖ్యలనే తాను చెప్పానని.. అప్పటి పరిస్ధితులను, ఇప్పటి పరిస్ధితులను వివరించే ప్రయత్నం చేశానని ఆయన చెప్పారు. అలాగే లఖీంపూర్ ఖేరీ (lakhimpur incident) ఘటనపైనా ప్రధాని స్పందించారు. సుప్రీంకోర్ట్ (supreme court) విచారణకు యూపీ సర్కార్ సహకరిస్తుందని మోడీ స్పష్టం చేశారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో మాజీ ప్రధాని నెహ్రూ పేరును పలుమార్లు ప్రస్తావించారు. కొరియాలో యుద్ధం జరిగితే దాని ప్రభావం కొన్నిసార్లు మనపైనా ఉంటుందని ప్రధాని అన్నారు. దాంతో భారత్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికాలో ఏదైనా జరిగితే మనదేశంలో వస్తువుల ధరలపైనా ప్రభావం ఉంటుందని మోడీ చెప్పారు. గతంలో పలు సందర్భాల్లో నెహ్రూ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. అంతేకాకుండా రాజ్యసభలోనూ చేసిన ప్రసంగంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను వివరిస్తూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరును ప్రస్తావించారు. ఇలా మాజీ ప్రధానుల గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు.
Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు.
అటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఈ సారి ముచ్చింతల్‌లో ఇటీవలే ప్రారంభించిన సమతా విగ్రహాన్ని (Statue Of Equality) ఆధారంగా చేసుకుని విమర్శించారు. సమతా విగ్రహాన్ని చైనా తయారు చేసిందని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తరుచూ ప్రవచించే న్యూ ఇండియా అంటే చైనా నిర్భర్ అని అర్థమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నది. ప్రచారం చేసింది. మన ఆర్థిక వ్యవస్థను మనమే నిలబెట్టుకోవాలని, మన దేశ అవసరాలను మనమే తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఆత్మ నిర్భర్ నినాదం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ అవసరాలను భారతీయులే తీర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నది ఆ నినాదం ముఖ్య ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చైనా నిర్భర్ (China nirbhar) అనే వ్యంగ్యాన్ని జోడించి కేంద్రంపై విమర్శలు చేశారు.
