Asianet News TeluguAsianet News Telugu

యువ స్నేహితులకు ప్రధాని పిలుపు.. ఓటు వేయమంటూ అభ్యర్థన..

"అస్సాంలో మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో వేయాలి. ఓటుహక్కు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా ఓటు వేయండి. ముఖ్యంగా నా యువ స్నేహితులను ఓటు వేయమని పిలుస్తున్నాను" అని ప్రధాని మోడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

PM Narendra Modi calls upon his young friends to vote as phase 1 polling underway for West Bengal, Assam Assembly elections - bsb
Author
Hyderabad, First Published Mar 27, 2021, 9:18 AM IST

పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన 'యువ స్నేహితులను' ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల తరువాత, ప్రధాని మోడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "అస్సాంలో మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో వేయాలి. ఓటుహక్కు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా ఓటు వేయండి. ముఖ్యంగా నా యువ స్నేహితులను ఓటు వేయమని పిలుస్తున్నాను" అన్నారు. 

అలాగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. "ఈ రోజు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ మొదలయింది. ఓటుహక్కును అందరూ వినియోగించుకోవాలి.  రికార్డు స్థాయిలో ఓటుహక్కు వినియోగం జరగాలని అభ్యర్థిస్తున్నాను"  అని ప్రధాని అన్నారు. 

ఈ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా, అస్సాంలో 47 కి పైగా సీట్లకు ఓటింగ్ జరుగుతుంది. 2021 బెంగాల్ ఎలక్షన్స్ ఎనిమిది దశల్లో జరగనున్నాయి. వీటిలో శనివారం జరుగుతున్న మొదటి దశ పోలింగ్ లో 191మంది అభ్యర్థుల అదృష్టాలు నిర్ణయించనుంది. ముఖ్యంగా ఈ పోటీ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్యే కొనసాగుతోంది. 

ఇక అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా ప్రధాన పోటీ అధికార బీజేపీ-ఎజీపీ కూటమికి,  కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మధ్య జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios