భారత్‌లో  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పర్యటన  విజయవంతంగా కొనపాగుతుంది.  మోదీతో జిన్‌పింగ్‌ రెండో రోజు కూడా భేటీ అయ్యారు.  తమిళనాడులోని కోవలంలో  వీరు
సమావేశమయ్యారు. శనివారం ఉదయం కొవలం చేరుకున్న షీ జిన్‌పింగ్‌‌కు  మోదీ స్వాగతం పలికారు. అనంతరం తాజ్‌ ఫిషర్‌మ్యాన్స్‌ కోవ్‌ హోటల్లో ఇరువురు అధినేతలు 
భేటి అయ్యారు. 

ఎలాంటి ఆడంబరమైన కార్యక్రమాలు లేకుండానే వీరి ఇరువురి భేటి కొనసాగింది. ఈ సమావేశంలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు అధినేతలు చర్చించారు. ఈ
అంశాలపై నేతలు ఒక్కరికొక్కరు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ భేటీ తర్వాత ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు  ముగిసిన అనంతరం భారత్  చైనా దేశానికి చెందిన అధికారులు భేటి వివరాలను ప్రకటిస్తారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం చెన్నై చేరుకున్న జిన్‌పింగ్‌  మహాబలిపురంలోని
మామల్లాపురంలో  పర్యటించారు. మామల్లాపురంలో చేరుకున్న జిన్ పింగ్‌కు మోదీ  ఘనస్వాగతం పలికారు. తర్వాత అక్కడి ఉన్న చారిత్రక కట్టడాలను ఇరువురు నేతలు వీక్షించారు. ఆ ప్రాచిన శిలా వైభవం గురించి మోదీ జిన్‌పింగ్‌కు వివరించారు. శనివారంతో చైనా అధ్యక్షుడి పర్యటన ముగుస్తుంది.