ప్రజలు బంగారు బెంగాల్ కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు  ప్రధాని నరేంద్రమోడీ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన కోల్‌కతాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు

ప్రజలు బంగారు బెంగాల్ కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్రమోడీ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన కోల్‌కతాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.

టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్, బెంగాల్ వ్యతిరేకులంతా ఓ వైపు చేరారని... మరోవైపు బెంగాల్ ప్రజలు నిలబడ్డారని ప్రధాని అన్నారు. చొరబాటుదారుల్ని అడ్డుకుంటామన్న ఆయన.. బెంగాల్ బిడ్డ మిథున్ చక్రవర్తి ఇవాళ బీజేపీలో చేరారని మోడీ తెలిపారు.

బెంగాల్‌లో పెట్టుబడులు పెరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. స్టార్టప్‌లకే కోల్‌కతా కేంద్రంగా వుండేలా కృషి చేస్తానని.. నరేంద్రమోడీ వెల్లడించారు. కాగా, ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం, అభ్యర్థుల ప్రకటన జరుగుతుండడంతో ప్రచారంలో మరింత జోరు పెంచేందుకు ప్రధాని రంగంలో దిగారు.

మొదటి దశ పోలింగ్‌ 27న జరగనుంది. బెంగాల్‌ ఎన్నికల ప్రచారం కోసం మోడీ 20 ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.