ప్రధాని నరేంద్ర మోడీ కలగంటున్న నూతన భారతంలో యువతకు పుష్కల అవకాశాలు ఉంటాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. తద్వార భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. కోజికోడ్‌లో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు.
కోజికోడ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలలు గంటలున్న న్యూ ఇండియాలో భారత యువతకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయని, దేశ అభివృద్ధి పథానికి వారే ప్రధాన భూమిక పోషిస్తారని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కాలికట్ ఎన్ఐటీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఆయన కీలక విషయాలు మాట్లాడారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఎనిమిదళ్ల స్వల్పకాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయంగా మార్పులు వచ్చాయని వివరించారు.
దేశంలోని వైబ్రంట్ స్టార్టప్స్ ఇకోసిస్టమ్ గురించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు. దేశంలో సుమారు 78 వేల స్టార్టప్‌లు, 110 యూనికార్న్‌లు ఉన్నాయని అన్నారు. వీళ్లు కేవలం కొత్త ఆవిష్కరణలే కాదు.. వాటితోపాటు ఉద్యోగాలను సృష్టిస్తున్నారని వివరించారు. పెట్టుబడిదారులతో విద్యార్థులకు సంబంధాలు నెలకొల్పే ఒక ఇంటర్ఫేస్‌ను కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వార విద్యార్థులు స్టార్టప్ వ్యవస్థ వాతావరణంతో పరిచయం అవుతారని వివరించారు.
విద్యార్థులను ఉద్దేశిస్తూ.. తమ ఫ్యూచర్‌ను కేవలం ప్లేస్‌మెంట్ల చట్రం నుంచే చూడొద్దని, ఆవిష్కరణలు, సంస్థల ప్రారంభించడానికి గల అవకాశాలనూ పరిశీలించాలని సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ల కోసం తీసుకున్న సానుకూల అంశాలను చూడాలని వివరించారు.
గతంలో 97 శాతం భారత బ్యాంకింగ్ వ్యవస్థ నికర విలువను కేవలం తొమ్మిది లేదా పది కుటుంబాలకే పరిమితమై ఉండేవని క్రెడిట్ సూస్ రిపోర్టును ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయని వివరించారు. అందులో ఎవరికీ ఫేమస్ తండ్రులో, తాతలో లేరని చెప్పారు. భారత యువతకు సమృద్ధిగా అవకాశాలు, నైపుణ్యాలుంటే ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్ ఉంటే అభివృద్ధికి దారులు వేసుకున్నట్టేనని వివరించారు. ఈ అవకాశాలను కేరళ యువత అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కల్చర్ కోసం, పెట్టుబడులు అందుబాటులో ఉంచడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూ తిరగకుండా స్వేచ్ఛను కల్పిస్తున్నట్టు తెలిపారు.
ప్రధాని మోడీ విజన్‌లో చెబుతున్న వచ్చే దశాబ్దం మొత్తం టెక్ చుట్టే తిరుగుతుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం డిజిటల్ విప్లవం తీసుకురావాలని యోచిస్తున్నదని, ఇది కేవలం ప్రధాన పట్టణాలే కాదు.. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలకూ వ్యాపించి ఉంటుందని వివరించారు.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, సెమికండక్టర్స్ రంగాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలక్ట్రానిక్ రంగంలో విశేష మార్పులు వచ్చాయని వివరించారు. ఇప్పుడు 2026 కల్లా 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్‌ను టార్గెట్ పెట్టుకున్నామని ఆయన తెలిపారు. టెక్ వినియోగదారిగా ఉన్న భారత్ ఇప్పుడు ఉత్పత్తిదారుడే కాదు.. వాటిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని వివరించారు. 5జీ ప్రవేశంతో ప్రపంచానికి భారత్ నమ్మకమైన మిత్రుడిగా ఉంటుందని చెప్పారు. కోజికోడ్ రెండు రోజుల పర్యటనలో ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) సెంటర్‌ను పర్యటించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పరిధిలోని దీని పురోగతిని సమీక్షించారు. ఎన్ఐఈఎల్ఐటీ స్కిల్, టాలెంట్, కెపాసిటీ ఎనేబులర్‌గా ఉండాలని, తద్వార ప్రభుత్వం యోచిస్తున్న ఒక ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. అనంతరం, ఆయన మలబార్ చాంబర్ ఆఫ్ కామర్స్, కాలికట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సభ్యులతో కలిశారు.
