Asianet News TeluguAsianet News Telugu

టీకా వృథాను అరికట్టండి.. తోటి వారికి సహకరించండి: దేశప్రజలకు మోడీ పిలుపు

కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్‌ను వృథా చేయాలని సూచించారు ప్రధాని నరేంద్రమోడీ. వైరస్ కట్టడి కోసం జరుగుతున్న ‘టీకా ఉత్సవ్’ నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. సాధ్యమైనంత వరకు అత్యధిక సంఖ్యలో టీకాలను ఇవ్వాలని మోడీ విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 మహమ్మారిపై రెండో యుద్ధంగా ఈ ఉత్సవాలను ఆయన అభివర్ణించారు. 

PM Modis Four Appeals As Tika Utsav To Step Up Vaccine Coverage Starts KSP
Author
New Delhi, First Published Apr 11, 2021, 3:59 PM IST

కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్‌ను వృథా చేయాలని సూచించారు ప్రధాని నరేంద్రమోడీ. వైరస్ కట్టడి కోసం జరుగుతున్న ‘టీకా ఉత్సవ్’ నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. సాధ్యమైనంత వరకు అత్యధిక సంఖ్యలో టీకాలను ఇవ్వాలని మోడీ విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 మహమ్మారిపై రెండో యుద్ధంగా ఈ ఉత్సవాలను ఆయన అభివర్ణించారు. 

కాగా, టీకా ఉత్సవాలు ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ ఈ కార్యక్రమం గురించి ప్రకటించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి నుంచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వరకు ఈ ఉత్పవాలు జరుగుతాయని మోడీ సోషల్ మీడియా ద్వారా ఆదివారం తెలిపారు. 

టీకా ఉత్సవాలు కోవిడ్-19పై రెండో యుద్ధానికి నాంది అని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతను పాటించాలని విజ్ఞప్తి చేశారు. మన దేశంలో జన సాంద్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ వైరస్ వ్యాప్తిపై పోరాడేందుకు మైక్రో కంటెయిన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమివ్వాలని మోడీ సూచించారు.

సాధ్యమైనంత ఎక్కువమంది అర్హులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, సున్నా వ్యాక్సిన్ అయినా వృథాకారాదని దృఢంగా నిర్ణయించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.  టీకా ఉత్సవ్ జరిగే నాలుగు రోజుల్లో కనీసం ఒక వ్యాక్సిన్ అయినా వృథా కాకపోతే మన వ్యాక్సినేషన్ సామర్థ్యం పెరిగినట్లేనని ఆయన చెప్పారు.

Also Read:ఇండియాలో కరోనా కల్లోలం: ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు, మరణాల నమోదు

ప్రతి ఒక్కరూ మరొకరికి టీకా వేయించాలని.. అలాగే నిరక్షరాస్యులకు, వృద్ధులకు వ్యాక్సినేషన్‌కు సహాయపడాలని ప్రధాని కోరారు. వ్యాక్సినేషన్ సదుపాయాల గురించి సమాచారం తెలియనివారికి సహకరించాలని చెప్పారు.

ప్రతి ఒక్కరూ తనను తాను కాపాడుకోవడంతోపాటు ఇతరులను కూడా కాపాడటం కోసం మాస్క్ ధరించాలని నరేంద్రమోడీ తెలిపారు. ఏదైనా ప్రదేశంలో ఒకరికి కరోనా వైరస్ సోకితే, ఆ ప్రాంతాన్ని మైక్రో కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించడంలో స్థానికులు సహకరించాలని మోడీ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios