న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నుండి ఆర్ధిక వ్యవస్థ త్వరగా బయట పడాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సంక్షోభ సమయాన్ని  అవకాశాలుగా మలుచుకొందామని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ, అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తో వీడియో కాన్పరెన్స్ లో గురువారం నాడు మాట్లాడారు. భారత్, అస్ట్రేలియాలు పరస్పర సహకారంతో ఎదుగుతాయన్నారు. భారత్ కు తమ దేశంతో మంచి సంబంధాలు ఉన్న విషయాన్ని అస్ట్రేలియా ప్రధాని గుర్తు చేసుకొన్నారు.

వాణిజ్య, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో పరస్పరం కలిసి పనిచేద్దామని సూచించారు. ఇరు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక ఒప్పందాలు సంతోషదాయకమన్నారు.

వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో మాసంలోనే అస్ట్రేలియా ప్రదాని మోరిసన్ ఇండియా పర్యటనకు రావాల్సి ఉంది. అయితే ఆ దేశంలో  కార్చిచ్చు కారణంగా పర్యటన వాయిదా పడింది.

also read:ఇండియాలో ఒక్క రోజులోనే అత్యధికంగా 9,304 కరోనా కేసులు: మొత్తం 2,16,919కి చేరిక

ఈ ఏడాది మే మాసంలో అస్ట్రేలియా ప్రధాని ఇండియాకు రావాలని ప్లాన్ చేసుకొన్నాడు. అయితే ఈ సమయంలో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ పర్యటన కూడ వాయిదా పడింది.

వచ్చే మాసంలో ఇండియాకు రావాలని మోడీ అస్ట్రేలియా ప్రధానిని ఆహ్వానించారు. ఇండియాకు అస్ట్రేలియా ప్రధాని వస్తే రెండు దేశాల మధ్య పలు అంశాల మధ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.