లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దక్షిణ రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. తాజాగా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళలో అడుగుపెట్టారు. ఆయన రెండు రోజులు కేరళ రాష్ట్రంలో పర్యటిస్తారు. మంగళవారం కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. 

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ మరింత పెంచింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కేరళలో అడుగు పెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయన ఈ రోజు కొచ్చిలో రోడ్ షోలో మాట్లాడుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రకటించారు. మంగళవారం ప్రధాని మోడీ.. తిరువనంతపురం, కాసర్‌గోడ్‌ను కలుపుతూ సేవలు అందించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు.

కేరళ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నది. కానీ, అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడటం లేదు. ఈ నేపథ్యంలో కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి అనుగుణం తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి గల ప్రాధాన్యత ఇక్కడి యువతకు తెలుసు అని ప్రధాని మోడీ అన్నారు.కన్నూర్, కొచ్చిన్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కూడా ఎందుకు ముఖ్యమో వారికి తెలుసు అని వివరించారు. రేపు కేరళల తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పొందనున్నారు. 

Also Read: మన్ కీ బాత్ రికార్డు: 100 కోట్ల శ్రోతలను చేరుకుందని తేల్చిన ఐఐఎం సర్వే

తమ ప్రభుత్వం ఫిషరీ సెక్టార్‌కు ముఖ్యమైన సహకారాలు అందించిందని, ఇది కేరళకు ఎక్కువ లబ్ది చేకూర్చి ఉంటుందని తెలిపారు. కిసాన్ కార్డు ప్రయోజనాలనూ ఈ రంగానికి విస్తరించి కేరళ ప్రజలకు ఉపకరించేలా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సీఏపీఎఫ్ పరీక్షలను మలయాళం భాషనలో రాయవచ్చని తెలిపారు.

మంత్ర తంత్రాలకు ఫుల్‌స్టాప్ పెట్టే అవసరం వచ్చినప్పుడు ఇక్కడి నారాయణ్ గురు ముందడుగు వేశారని గుర్తు చేశారు.