బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ నేడు 96వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో దేశ్యాప్తంగా  ఉన్న పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ నేడు 96వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో దేశ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోకి ఎల్‌కు అద్వానీ నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ దాదాపు 30 నిమిషాల పాటు అద్వానీ నివాసంలో గడిపారు. అద్వానీకి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. 

రాజ్‌నాథ్ సింగ్‌ కూడా ఎల్‌కే అద్వానీకి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాజ్‌నాథ్ సింగ్.. “గౌరవనీయమైన అద్వానీజీ నివాసాన్ని సందర్శించాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

ఇక, లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8వ తేదీన జన్మించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వాలంటీర్‌గా అద్వానీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకులలో అద్వానీ ఒకరు. ఆయన 1998 నుంచి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. 2022 జూన్ నుంచి 2004 మేరకు భారత ఉప ప్రధానిగా సేవలు అందించారు. ఆయన 10వ లోక్‌సభ, 14వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 1990లలో బీజేపీకి శక్తి కేంద్రంగా ఉన్నాడు. 2009లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా అద్వానీ ఉన్నారు.. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోలేకపోయింది.