Asianet News TeluguAsianet News Telugu

'గొప్ప వార్త'..చిరుతలను పెద్ద ఎన్‌క్లోజర్‌కి మారడంతో ప్రధాని మోదీ ట్వీట్

నమీబియా నుండి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చిన ఎనిమిది చిరుతల్లో రెండింటిని తప్పనిసరి నిర్బంధం తర్వాత మరింత అనుకూలత కోసం పెద్ద ఎన్‌క్లోజర్‌కు విడుదల చేసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ట్వీట్ చేశారు.

PM Modi tweets as two cheetahs shift to bigger enclosure at Kuno National Park
Author
First Published Nov 6, 2022, 10:31 AM IST

ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో రెండు మగ చిరుతలను పెద్ద ఎన్‌క్లోజర్‌లలోకి తరలించారు. ఇప్పుడు అవి మరింత అనుకూలత జీవిస్తాయి.  కొంత ఎక్కువ విస్తీర్ణంలో బహిరంగంగా వేటాడవచ్చు. మిగిలిన ఆరు చిరుతలను కూడా దశల వారీగా విడుదల చేయనున్నారు. 

చిరుతలను పెద్ద ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. చిరుతలన్నీ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని, పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకున్నాయని    తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. "గొప్ప వార్త! నిర్బంధం తర్వాత.. రెండు చిరుతలను కునో ఆవాసాలకు మరింత అనుకూలంగా మార్చుకోవడం కోసం ఒక పెద్ద ఎన్‌క్లోజర్‌కి విడుదల చేశారని అధికారులు తెలిపారు.  మరికొన్ని త్వరలో విడుదల కానున్నాయి. చిరుతలన్నీ ఆరోగ్యంగా, చురుగ్గా, చురుకుగా ఉన్నాయని తెలిసి.. నేడు చాలా సంతోషిస్తున్నాను. అవి ఇక్కడి పరిస్థితులకు చాలా బాగా సర్దుకుపోతున్నాను' అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో రాశారు.

 

నలుగురు సభ్యుల ప్రాజెక్టు చీతా టాస్క్‌ఫోర్స్‌ టీం శనివారం కునో నేషనల్ పార్క్‌లో చిరుతల కోసం ఏర్పాటు చేసిన పెద్ద ఎన్‌క్లోజర్‌లను పరిశీలించారు. వాటి కోసం ఏర్పాటు చేసిన  ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో  చిరుతలను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో చిరుతలను శనివారం విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో నుంచి వాటిని ఉంచిన క్వారంటైన్ ప్రాంతంలో అవి అలవాటు పడ్డాయని, వాటిని పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి పంపించామని కునో నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రకాష్ కుమార్ వర్మ మీడియాకు  తెలిపారు. అయితే.. ఈ విషయంపై అటవీ శాఖ మంత్రి విజయ్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిర్ణీత తేదీకి ముందే అధికారులు తమ సొంత పూచీకత్తుపై వదిలేశారని అంటున్నారు. 

 ప్రాజెక్ట్ చీతా

దేశంలో కనుమరుగవుతున్న చిరుతను తిరిగి పునర్దించడానికి ప్రాజెక్టు చీతా అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా.. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో సెప్టెంబర్ 17న  ప్రధాని మోడీ (ప్రధాని పుట్టినరోజున) నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మోదీ ప్రత్యేక క్వారెంటైన్‌ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. వాటిని  ప్రత్యేక విమానంలో నమీబీయా నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌కి తరలించారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో కునే నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు.

8 చీతాలలో 4 నుంచి 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. వీటి పర్యవేక్షణ కోసం చీతాల మెడలో రేడియో కాలర్స్ ను అమర్చారు. వీటి సహాయంతో ఇవి ఎక్కడ ఉన్నది శాటిలైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటి ఆరోగ్య పరిస్తితులను తెలుసుకోవచ్చు. ప్రపంచం మొత్తం మీద కేవలం 7వేల చీతాలు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఈ చీతాలు ఐయూసీఎన్ రెడ్ లిస్టులో చేర్చారు. చితాలు  భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తగలవు. వీటి గంటకు 128 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తాగలవు.   

Follow Us:
Download App:
  • android
  • ios