ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన సొంత రాష్ట్రం గుజరాత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు గుజరాత్ లో ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు.

సోమవారం రాత్రే గుజరాత్ చేరుకున్న మోదీ... ఈ రోజు ఉదయం గాంధీనగర్ నుంచి కేవడియా వెళ్లారు. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్ ను సందర్శించారు.  మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు.

కేవడియా వెళ్లే మార్గంలో హెలికాప్టర్ లో నుంచే మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వీడియో తీశారు. ఈ వీడియోని ఆయన తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ అందమైన ప్రదేశాన్ని మీరూ చూడండి అంటూ ట్విట్టర లో తన ఫాలోవర్స్ ని మోదీ కోరారు. ఇదిలా ఉండగా... మోదీకి పలువురు ప్రముఖులు, నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.