ప్రధాని నరేంద్ర మోదీ కాశీ క్షేత్రాన్ని కనిపెట్టారు. ఓ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫొటోకు కాశీ అని కనిపెట్టి దాని గురించి వివరాలు కూడా చెప్పుకొచ్చారు మోదీ. వివరాల్లోకి వెడితే లాస్ట్ టెంపుల్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ఫొటో షేర్ చేశారు. 

ఆ ఫొటోలో కళకళలాడుతున్న నదీ తీరం, ఒక అద్భుత ఆలయం, పూజలు చేస్తున్న భక్తులు... ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఫోటో కింద ఒక ప్రశ్న కూడా ఉంది...‘మీరు ఈ సుందర నగరాన్ని గుర్తు పట్టగలరా?’ అని రాసి వుంది.

ఈ ఫొటోను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ అదే సోషల్ మీడియాలో ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆ పట్టణం గురించే కాకుండా అక్కడున్న ఆలయాన్ని కూడా గుర్తుపట్టి చెప్పారు. ప్రధానమంత్రి తన ట్వీట్‌లో.. ‘ఆ ఫోటోలో కనిపిస్తున్న నగరం ఉత్తరప్రదేశ్‌లోని ’కాశీ’. అది రత్నేశ్వర్ మందిరం’ అని రాశారు. 

కాగా లాస్ట్ టెంపుల్స్‌ను ఫాలో చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ 2017లో దేవ్ దీపావళి పండుగ సందర్భంగా కాశీకి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు కొన్ని నిముషాల వ్యవధిలోనే కొన్ని వేల లైక్స్ వచ్చాయి.