Asianet News TeluguAsianet News Telugu

PM Narendra Modi: నేటి నుంచి ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 2-3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ మరియు కేరళలో పర్యటించనున్నారు. తన పర్యటనలో ప్రధాని మోదీ కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు , ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 

PM Modi to visit Tamil Nadu, Lakshadweep, Kerala today kRJ
Author
First Published Jan 2, 2024, 7:12 AM IST

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జనవరి 2 నుంచి రెండు రోజుల పాటు తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యటన సందర్భంగా మోదీ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా తెలియజేశారు.  తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రూ. 1,150 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారు. ఈ పనులలో మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, సౌరశక్తి, ఆరోగ్య సంరక్షణ మరియు మరిన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తారు.
 
తమిళనాడులో ప్రధాని మోదీ

పీఐబీ ప్రకారం.. ప్రధాని మోదీ జనవరి 2న ఉదయం 10:30 గంటలకు తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొంటారు. విద్యార్థులకు పట్టాలంద జేసి.. వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నరు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో విమానయానం, రైలు, రోడ్డు, చమురు , గ్యాస్, షిప్పింగ్ మరియు ఉన్నత విద్యా రంగాలకు సంబంధించిన రూ. 19,850 కోట్ల కంటే ఎక్కువ విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారు. 

ఆ తరువాత తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.11,00 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఇక్కడ నిర్మించబడుతున్న కొత్త రెండు-స్థాయి భవనం ఏటా 44 లక్షల మంది ప్రయాణికులకు , రద్దీ సమయాల్లో దాదాపు 3,500 మంది ప్రయాణికులకు సేవలందించగలదు. పర్యటనలో భాగంగా ప్రధాని తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశమతారని సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా పరిశీలించడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం.

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ

లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 3:15 గంటలకు అగట్టికి చేరుకుంటారు, అక్కడ బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.  మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం.. కేంద్రపాలిత ప్రాంతంలో ఇంటర్నెట్ వేగం సవాలును పరిష్కరించడానికి కొచ్చి-లక్షద్వీప్ దీవుల సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ (KLI-SOFC) ప్రాజెక్ట్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఇది ఇంటర్నెట్ స్పీడ్‌ను 100 రెట్లు (1.7 Gbps నుండి 200 Gbps వరకు) కంటే ఎక్కువ పెంచుతుంది. అలాగే.. కద్మత్‌లోని లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్ (ఎల్‌టిటిడి) ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా ప్రతిరోజు 1.5 లక్షల లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఉత్పత్తి అవుతుంది.

 అగట్టి, మినికాయ్ దీవుల్లోని అన్ని ఇళ్లలో పనిచేసే గృహ కుళాయి కనెక్షన్‌లను (FHTC) కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు. లక్షద్వీప్ దీవులలో త్రాగునీటి లభ్యత ఎల్లప్పుడూ సవాలుగా ఉంది, ఎందుకంటే పగడపు ద్వీపం, భూగర్భ జలాల లభ్యత చాలా పరిమితం. ఈ తాగునీరు ప్రాజెక్టులు ద్వీపాల  పర్యాటక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తద్వారా స్థానిక ఉపాధి అవకాశాలను పెంచుతాయి.

దేశానికి అంకితం చేయబడిన ఇతర ప్రాజెక్టులలో కవరత్తిలో సౌర విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. ఇది లక్షద్వీప్‌లోని మొదటి బ్యాటరీ సపోర్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. కవరత్తిలోని ఇండియా రిజర్వ్ బెటాలియన్ (IRBN) కాంప్లెక్స్‌లోని కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ , 80 మంది పురుషుల బ్యారక్‌లలో డీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.


కల్పేనిలోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సదుపాయం పునరుద్ధరణకు, ఆంద్రోత్, చెట్లత్, కద్మత్, అగట్టి , మినికాయ్ ఐదు దీవులలో ఐదు మోడల్ అంగన్‌వాడీ కేంద్రాల (నంద్ ఘర్లు) నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జనవరి 3న కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో కొత్త సంవత్సరంలో ప్రధాని మోదీ ఈ పర్యటన జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కో ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ పర్యటన బీజేపీ దక్షిణాది మిషన్‌కు బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios