ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. కచ్ లోని ధోర్డో‌తో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది రాయి వేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో డీశాలినేషన్ ప్లాంట్, హైబ్రిడ్ పునరుత్పాదక ఎనర్జీ పార్క్, ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ సైతం పాల్గొంటారు. 

కచ్‌లోని మాండ్వి వద్ద రాబోయే డీశాలినేషన్ ప్లాంట్‌తో గుజరాత్ సముద్ర తీరాన్ని త్రాగునీటిగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం. రోజుకు 10 కోట్ల లీటర్ సామర్థ్యం (100 ఎంఎల్‌డి) ఉన్న ఈ డీశాలినేషన్ ప్లాంట్‌ గుజరాత్‌లోని నర్మదా గ్రిడ్, సౌని నెట్‌వర్క్, వంటి వాటి సరసన చేరింది.

దేశంలో స్థిరమైన , సరసమైన నీటి వనరులను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్‌ను మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ముంద్రా, లఖ్‌పత్, అబ్దాసా, నఖత్రనా తాలూకా ప్రాంతాలలోని దాదాపు 8 లక్షల మంది ప్రజలు ఈ ప్లాంట్ నుండి డీశాలినేటెడ్ నీటిని అందుకుంటారు. ఇక మిగులు జలాలను భాచౌ, రాపర్, గాంధీధామ్ అప్‌స్ట్రీమ్ జిల్లాలకు సహాయపడుతుంది.

గుజరాత్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు డీశాలినేషన్ ప్లాంట్లలో ఇది ఒకటి. మిగిలిన నాలుగు .. దహేజ్ (100 ఎంఎల్‌డి), ద్వారకా (70 ఎమ్‌ఎల్‌డి), ఘోఘా భావ్‌నగర్ (70 ఎమ్‌ఎల్‌డి) గిర్ సోమనాథ్ (30 ఎంఎల్‌డి) 

72,600 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో గాలి, సౌర శక్తి నిల్వ కోసం ప్రత్యేక హైబ్రిడ్ పార్క్ జోన్ ఉంటుంది, అలాగే విండ్ పార్క్ కార్యకలాపాలకు ప్రత్యేకమైన జోన్ ఉంటుంది.

కచ్‌లోని సర్హాద్ డెయిరీ అంజార్ వద్ద ఆటోమేటెడ్ పాల ప్రాసెసింగ్ , ప్యాకింగ్ ప్లాంట్‌కు ప్రధాని పునాది రాయి వేయనున్నారు. ఈ ప్లాంటు అంచనా వ్యయం రూ .121 కోట్లు. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు వుంది.