న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 29వ తేదీన  భౌపూర్  ఖుర్జా  సెక్షన్ ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రయాగ్రాజ్ లో ఈడీఎఫ్‌సీ సెంటర్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు.

351 కి.మీ కుర్జా బౌపూర్ సెక్షన్  ను రూ. 5750 కోట్లతో ఏర్పాటు చేశారు.  ఈ మార్గం ద్వారా స్థానికంగా అల్యూమినియం, పాడి రంగం , వస్త్ర ఉత్పత్తి , బ్లాక్, ప్రింటిగ్  పరిశ్రమలకు ఉపయోగపడుతోంది.

ప్రయాగ్రాజ్ లోని టె ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్  కు మొత్తం మార్గం పొడవుకు కమాండ్ సెంటర్ గా పనిచేస్తోంది.

ఈ నెల ప్రారంభంలో ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 4893 టన్నుల లోడ్ తో బొగ్గును 59 వ్యాగన్లతో ఓ  రైలు ఈ మార్గంలో ప్రయాణించింది. డిసెంబర్ 10వ తేదీన పంజాబ్ లోని నభా పవర్ హౌస్ కోసం బొగ్గును ఈ మార్గం గుండా తరలించారు.

ఈడీఎఫ్‌సీ  లూథియానా సమీపంలోని సహనేవాల్ నుండి ప్రారంభం కానుంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల గుండా బెంగాల్ లోని డంకుని వద్ద ఈ మార్గం ముగియనుంది. డిఎఫ్‌సీసీఐఎల్ దీన్ని నిర్మించింది.

ఈ మార్గం వల్ల  అరవై ఎనిమిది లెవల్ క్రాసింగ్ లను తొలగించారు. వేగంతో పాటు భద్రతను పెంచుతున్నాయని డెడికేట్ ఫ్రైట్ కారిడార్ కార్పోరేషన్ తెలిపింది. ఈ మార్గంలో 19 వంతెనలు, 414 చిన్న వంతెనలు, ఏడు రైల్వే ఫ్లై ఓవర్లున్నాయి.