ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లతో సంభాషించనున్న ప్రధాని మోదీ..

ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. 

PM Modi to interact with Indian athletes who participated in the Asian Games on 10th October ksm

ఏషియన్ గేమ్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలసిందే. ఈ క్రీడల్లో భారత్ 107  పతకాలు(28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించి.. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. అనంతరం మోదీ ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి గొప్ప విజయాలు సాధించిన క్రీడాకారులను దేశప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోదీ అభినందించనున్నారు. 

ఏషియన్ గేమ్స్‌లో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు, భవిష్యత్తులో జరిగే పోటీలకు వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏషియన్ గేమ్స్‌లో 2022లో 28 బంగారు పతకాలతో సహా భారతదేశం మొత్తం 107 పతకాలను గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో.. భారత్ సాధించిన పతకాల సంఖ్య ప్రకారం ఇది దేశ అత్యుత్తమ ప్రదర్శన. దీంతో భారత అథ్లెట్ల ప్రదర్శనపై దేశం మొత్తం గర్విస్తోంది. 

ఇక, ప్రధాని మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఆసియా క్రీడల కోసం భారత బృందంలోని అథ్లెట్లు, వారి కోచ్‌లు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇక, ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios