న్యూఢిల్లీ: వారణాసిలో కరోనా పరిస్థితిపై ఆదివారం నాడు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలో కరోనా కేసులు  భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న  వారణాసిలో కరోనా పరిస్థితులపై  సమీక్షించననున్నారు మోడీ.

 

వారణాసిలో కరోనాపై మోడీ నిర్వహించే సమీక్ష సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశంలో కరోనా స్థితిగతులపై  శనివారం నాడు  మోడీ సమీక్షించారు.  దేశంలో కరోనా కేసులు, వ్యాక్సిన్ నిల్వలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి  సమీక్ష నిర్వహించారు. గతంలో  ఏ రకంగా దేశం మొత్తం  కరోనాను  ఓడించామో ఈ ఏడాది కూడ  కరోనాను  ఓడిస్తామనే ధీమాను మోడీ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

దేశంలో రెండు మూడు రోజులుగా రెండు లక్షలకు పైగా కరోనా కేసులు  నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల నమోదు భారీగా ఉన్నట్టుగా  వైద్య ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.పరీక్షలు, ట్రాకింగ్, చికిత్సకు ప్రత్యామ్నాయం లేదని  మోడీ శనివారం నాడు అధికారులతో నిర్వహించిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయి అధికారులు ఈ విషయమై జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.