ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు(సోమవారం) కేంద్ర మంత్రి మండలి సమావేశం కానున్నది. ప్రధానంగా మంత్రి మండలి పునర్వవస్థీకరణ పై చర్చించే అవకాశం జరుగనున్నది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు(సోమవారం) కేంద్ర మంత్రి మండలి సమావేశం కానున్నది. ఈ కీలక సమావేశంలో ప్రధానంగా మంత్రి మండలి పునర్వవస్థీకరణ పై చర్చించే అవకాశం జరుగనున్నది. అధికార బీజేపీ అగ్రనేతల వరుస సమావేశాల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర మంత్రి మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. సెప్టెంబరులో జరిగే G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.
ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ తన పార్టీకి చెందిన 40 మంది శాసనసభ్యులతో బిజెపి-శివసేన ప్రభుత్వంలో చేరడం వంటి కీలక పరిణామం నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో భాగంగా అజిత్ పవార్‌తో చేతులు కలిపిన కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు నూతన క్యాబినెట్‌లో చోటు కల్పించే అవకాశముంది.
అలాగే.. కేంద్ర క్యాబినెట్ లోకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. బీజేపీ మిత్రపక్షాలకు కూడా కేబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూలై 20న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందు.. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కావడం చర్చనీయంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలలో కీలక మార్పులను చూడవచ్చని, పార్టీ అగ్రనేతలకు కీలక పదవులను ఇవ్వవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఇదిలాఉంటే.. PM మోడీ జూన్ 28న కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. సంస్థాగత, రాజకీయ వ్యవహారాలను సమీక్షించడానికి షా, నడ్డాలతో పాటు ఇతరుల నేతలతో కూడిన క్లోజ్డ్-డోర్ సమావేశం జరిగింది. ఏదైనా క్యాబినెట్ లో మార్పులు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కారణమవుతాయి. కర్నాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించిన తర్వాత.. కొంత పుంజుకోవడంతో.. ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల కోసం బీజేపీ తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య తీవ్ర పోటీ నెలకొననున్నది.
