ఐదు భాషల్లో బ్రహ్మాస్త్ర పాట... సింగర్ పై ప్రధాని మోదీ ప్రశంసలు..!
ఓ సింగర్ ఒక పాటను ఐదు భాషల్లో పాడటంతో... ఆ పాట వైరల్ గా మారింది. ఆ వీడియోని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసిస్తూ... సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.

మన దేశం భిన్నత్వంలో ఏకత్వం. విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయం. మన దేశంలో చాలా రకాల ప్రాంతీయ భాషలు ఉన్నాయి. అన్ని భాషలకు ప్రాధాన్యత ఉంది. అందుకే... ఓ సింగర్ ఒక పాటను ఐదు భాషల్లో పాడటంతో... ఆ పాట వైరల్ గా మారింది. ఆ వీడియోని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసిస్తూ... సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.
స్నేహదీప్ సింగ్ అనే సింగర్...బ్రహ్మాస్త్ర సినిమాలోని హిట్ ట్రాక్ కేసరియా పాటను ఐదు భాషల్లో పాడాడు. అతని టాలెంట్ కి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో... అతని వీడియో వైరల్ గా మారింది. కాగా... ప్రధాని మోదీ స్పెషల్ గా ట్వీట్ చేశారు.
“ప్రతిభావంతులైన @SnehdeepSK ఈ అద్భుతమైన ప్రదర్శనను చూశాను. మెలొడీ ఇంకా అద్భుతంగా ఉంది.‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’’ అంటూ క్యాప్షన్ జత చేశారు.
ఆయన పాట వీడియోకి 279k వ్యూస్ రావడం గమనార్హం. PM మోడీ పోస్ట్ తో మరింత వైరల్ అవుతోంది. స్నేహదీప్ అలియా భట్ రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా నుండి పాపులర్ ట్రాక్‌ని పాడారు. ఈ పాటను మొదట అరిజిత్ సింగ్ పాడారు. స్నేహదీప్ మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు , హిందీ భాషల్లో దీనిని ఆలపించడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వినేయండి.