అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాత్రి యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు నిలయమనీ, అన్ని వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. 

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) US కాంగ్రెస్ లో ప్రసంగించారు. ఈ చారిత్రాత్మక ప్రసంగంలో ప్రధాని మోడీ "భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం"ని హైలైట్ చేశారు. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారతదేశం నిలయమనీ, అన్ని వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. భారత్లో వైవిధ్యం సహజమైన జీవన విధానమనీ, నేడు ప్రపంచం మొత్తం భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

భారతీయ వైవిధ్యం గురించి మాట్లాడుతూ.." భారతదేశంలో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయి.. దాదాపు 20 వేర్వేరు పార్టీలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను పరిపాలిస్తున్నాయి. అలాగే.. భారత్ లో 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము ఒకే స్వరంలో మాట్లాడుతాం. ప్రతి 100 మైళ్లకు మా వంటకాలు దోస నుండి ఆలూ పరాటా వరకు మారుతున్నాయి." అని తెలిపారు.

అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించడం ఎల్లప్పుడూ గొప్ప గౌరవమని ప్రధాని మోదీ అన్నారు. "రెండుసార్లు అమెరికా పార్లమెంట్లో ప్రసంగించడం అసాధారణమైన విశేషం. ఈ గౌరవం అందించిన భారత ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అలాగే.. AI- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ద్వారా భారత్ లో సాధించిన పురోగతిని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలలో AI- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అనేక మార్పులు వచ్చాయనీ, అదే సమయంలో మరొక AI- (అమెరికా, భారతదేశం)లో మరింత ముఖ్యమైన అభివృద్ధి సాధించమని ప్రధాని తెలిపారు.

సమానత్వ పునాదిపై అమెరికా నిలబడిందనీ, భారత్ మూలాలు ఉన్న లక్షలాది మంది అమెరికాల ఉన్నారనీ, వారిలో కొందరు పార్లమెంట్ లో కూడా ఉన్నారనీ, అందులో ఒకరు కమలా హారిస్ ని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పవిత్రమైన, భాగస్వామ్య విలువల్లో ఒకటి అని ప్రధాని అన్నారు. ఇది చాలా కాలంగా అభివృద్ధి చెందింది వ్యవస్థ యొక్క వివిధ రూపాలను తీసుకుంది.

"ప్రజాస్వామ్యం అనేది మన పవిత్రమైన, భాగస్వామ్య విలువలలో ఒకటి. చరిత్ర అంతటా ఒక విషయం స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్యం సమానత్వం, గౌరవాన్ని సమర్ధించే ఆత్మ. ప్రజాస్వామ్యం అనేది చర్చ, ఉపన్యాసాలను స్వాగతించే ఆలోచన. ప్రజాస్వామ్యం అనేది ఆలోచనలకు రెక్కలు ఇచ్చే సంస్కృతి. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి" అని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాలు ప్రయాణించిన సుదీర్ఘమైన, విశాలమైన రహదారి ద్వారా భారత్, అమెరికా స్నేహానికి పరీక్ష పెట్టాయని ఆయన అన్నారు.

గత సంవత్సరం భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుందనీ, ప్రతి మైలురాయి ముఖ్యమైనది కానీ ఇది ప్రత్యేకమైనదని అన్నారు. వందల సంవత్సరాల విదేశీ పాలన తర్వాత భారతీయులు స్వాతంత్ర్యం పొందారనీ, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఓ పండుగలా జరుపున్నామని అన్నారు. ఇది కేవలం వేడుక కాదు. ప్రజాస్వామ్యం వేడుక అని అన్నారాయన.