దేశం మణిపూర్ ప్రజలతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. మణిపూర్ ప్రజలు కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న శాంతిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. శాంతి మాత్రమే పరిష్కారానికి మార్గాన్ని కనుగొంటుందని చెప్పారు.

దేశం మణిపూర్ ప్రజలతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. మణిపూర్ ప్రజలు కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న శాంతిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. శాంతి మాత్రమే పరిష్కారానికి మార్గాన్ని కనుగొంటుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో శాంతి కోసం ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ తన ప్రసంగంలో దేశంలోని ప్రజలను ‘‘పరివార్జన్’’ (కుటుంబ సభ్యులు) అని పదేపదే ప్రస్తావించారు. 

‘‘ఈ సంవత్సరం, దేశంలోని అనేక రాష్ట్రాలు ఊహించలేని సంక్షోభాన్ని చవిచూశాయి. బాధిత కుటుంబాలందరికీ నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని వారికి హామీ ఇస్తున్నాను. ఈశాన్యంలో ముఖ్యంగా మణిపూర్‌లో హింసాత్మక కాలం ఏర్పడింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తల్లులు, కుమార్తెల గౌరవంతో ఆడుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో శాంతి నెమ్మదిగా తిరిగి వస్తోంది. భారతదేశం మణిపూర్‌తో నిలుస్తుంది’’ అని ప్రధాని మోదీ చెప్పారు. 

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇప్పుడు జనాభా పరంగా అగ్రగామి దేశం. ఇంత పెద్ద దేశం.. నా కుటుంబంలోని 140 కోట్ల మంది సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ గొప్ప పండుగ సందర్భంగా దేశంలోని కోట్లాది ప్రజలకు, భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే కోట్లాది మంది ప్రజలకు నేను అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ వంతు సహకారం అందించిన ధైర్యవంతులందరికీ నా నివాళులు అర్పిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశ చైతన్యం, భారతదేశ సామర్థ్యం పట్ల ప్రపంచంలో కొత్త ఆకర్షణ, కొత్త విశ్వాసం ఏర్పడిందని అన్నారు.