వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు వారణాసిలో పర్యటించాు.వారణాసి పార్లమెంట్ స్థానం నుండి మోడీ రెండో సారి విజయం సాధించాడు. రెండోసారి ఈ స్థానం నుండి గెలిపించినందుకు మోడీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు వారనాసికి చేరుకొన్నారు.

 

 

రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి మూడు రోజుల  ముందు మోడీ వారణాసికి చేరుకొన్నారు. వారణాసిలోని ప్రముఖ కాశీనాథుని దేవాలయంలో మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఆదివారం నాడు తన తల్లి ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత మోడీ నేరుగా వారణాసికి చేరుకొన్నారు. వారణాసిలోని కాశీనాధుని దేవాలయంలో పూజలు నిర్వహించారు. మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. 

మోడీ వారణాసికి చేరుకోగానే రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి మోడీ మోడీ అంటూ నినాదాలు చేస్తూ అభివాదం చేశారు.