ట్రిపుల్ తలాక్ కి ప్రత్యేక చట్టం తీసుకువచ్చి.. ప్రధాని నరేంద్రమోదీ చాలా మంచి పనిచేశారని ఆయన రాఖీ సిస్టర్ ఖమర్ మోహ్సిన్ షేక్ అన్నారు.  ఆమె గత 25 సంవత్సరాలుగా మోదీకి రాఖీ కడుతున్నారు. ఆమె ఒక ముస్లిం మహిళ కావడం గమనార్హం. నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా మోదీని కలిసిన ఆమె.. రాఖీ కట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

‘నాకు మా సోదరికి రాఖీ కట్టే అవకాశం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. వచ్చే ఐదు సంవత్సరాలు ఆయనకు అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నాను. యావత్ ప్రపంచం మొత్తం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గుర్తించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.

అనంతరం ఆమె త్రిపుల్ తలాక్ చట్టం గురించి కూడా స్పందించారు. ఖురాన్, ఇస్లాంలో ఎక్కడా త్రిపుల్ తలాక్ అనేది లేదని ఆమె స్పష్టం చేశారు. త్రిపుల్ తలాక్ విషయంలో ప్రధాని మోదీ మాత్రమే చర్యలు తీసుకొని చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ముస్లిం మహిళల ప్రయోనాల కోసం ఆయన చాలా మంచి పనిచేశారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

ఖమర్ మోహ్సిన్ షేక్... పాకిస్తాన్ దేశస్థురాలు కాగా... వివాహం తర్వాత ఆమె భారత్ కి వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్ లోనే ఉంటున్నారు. గత 25 సంవత్సరాలుగా అంటే మోదీ ఆర్ఎస్ఎస్ లో జాయిన్ కాకముందు నుంచే మోదీకి రాఖీ కడుతుండటం విశేషం.