Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సినేషన్‌‌ను వేగవంతం చేయాలి: మోడీ

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలను కోరారు. 

PM Modi reviews state-wise Covid situation, Phase 3 vaccination progress lns
Author
New Delhi, First Published May 6, 2021, 5:02 PM IST


న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలను కోరారు. గురువారంనాడు  ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రులు, అధికారులతో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా కరోనా కేసులపై  ఆయన సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహకారం అందిస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా మందుల లభ్యతపై కూడ చర్చించారు. 

దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును మోడీ అడిగి తెలుసుకొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో  టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మోడీ కోరారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడంపై రోడ్ మ్యాప్ పై ఆయన చర్చించారు. రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసిన విషయాన్ని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. టీకాలు ఏ రాష్ట్రంలో వృధా అయ్యాయనే విషయమై కూడ ఆయన ఆరాతీశారు. లాక్‌డౌన్ ఉన్నా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మోడీ  సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios