Asianet News TeluguAsianet News Telugu

కొత్త పార్లమెంట్ ప్రారంభానికి గుర్తుగా ప్రత్యేక స్టాంపు, ₹ 75 నాణెం విడుదల చేసిన ప్ర‌ధాని మోడీ

New Delhi: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేక స్టాంప్ తో పాటు రూ.75 నాణేలను విడుద‌ల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నాణెం బరువు 34.65-35.35 గ్రాములుగా ఉంటుంది.
 

PM Modi releases a special stamp and RS 75 coin to mark the inauguration of the new Parliament RMA
Author
First Published May 28, 2023, 5:10 PM IST

Special Stamp, ₹ 75 Coin Released By PM Modi: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేక స్టాంప్ తో పాటు రూ.75 నాణేలను విడుద‌ల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నాణెం బరువు 34.65-35.35 గ్రాములుగా ఉంటుంది. పార్లమెంటు నూతన భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన నాణెం, స్టాంపును విడుదల చేశారు. ఈ నాణేం పై  పార్లమెంటు కాంప్లెక్స్ చిత్రం కూడా ఉంది. ముందు భాగంలో అశోక స్తంభం, దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంది. అశోక స్తంభం ఎడమ వైపున, భారతదేశం దేవనాగరి లిపిలో, కుడి వైపున భారతదేశం ఆంగ్లంలో రాసి ఉంది. 

నాణేనికి వెనుక భాగంలో పార్లమెంటు సముదాయం, పై భాగంలో హిందీ, దిగువన ఇంగ్లిష్ లో పార్లమెంట్ కాంప్లెక్స్ ఉన్నాయి. 2023 సంవత్సరం కూడా పార్లమెంటు చిత్రం క్రింద వ్రాయబడింది. 

 

 

రూ.75 నాణెం తయారీ ఎలా? 

రూ.75 నాణేన్ని భారత ప్రభుత్వానికి చెందిన కోల్ క‌తా మింట్ ముద్రించింది. ఈ 44 ఎంఎం నాణెం ఆకారం గుండ్రంగా ఉంటుంది. దీని బరువు 35 గ్రాములు. ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున నికెల్, జింక్ లోహాలు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios