C-295 విమాన తయారీ కర్మాగారం ప్రారంభోత్సవం.. ₹1.27 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి: డిఫెన్స్ రంగంపై మోదీ వ్యాసం

భారతదేశ రక్షణ పరిశ్రమ అభివృద్ధి గురించి ప్రధాని మోదీ LinkedIn లో ఒక వ్యాసం రాశారు. C-295 విమాన తయారీ ఉదాహరణగా చెబుతూ, భారతదేశం రక్షణ రంగంలో ఎలా స్వయం సమృద్ధి సాధిస్తోందో, ఎలా అభివృద్ధి చెందుతోందో వివరించారు.

PM Modi on India's Defense Revolution: C-295 Aircraft Factory Launch and Defense Industry Milestones GVR

న్యూఢిల్లీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ LinkedInలో భారతదేశ రక్షణ పరిశ్రమ అభివృద్ధి గురించి ఒక వ్యాసం రాశారు. గుజరాత్‌లోని వడోదరలో C-295 విమాన తయారీ కర్మాగారం ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ... భారతదేశ రక్షణ విప్లవం ఎలా ఊపందుకుందో వివరించారు.

మోదీ వ్యాసం ఇక్కడ చదవండి...

(అక్టోబర్ 28) భారతదేశ రక్షణ, ఏరోస్పేస్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. స్పెయిన్ ప్రభుత్వ అధిపతి పెడ్రో శాంచెజ్ తో కలిసి వడోదరలో C-295 విమాన తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాం. శంకుస్థాపన జరిగిన రెండేళ్లలోనే కర్మాగారం సిద్ధమైంది. ఇది కొత్త పని సంస్కృతి. ఇది భారతీయుల సామర్థ్యాన్ని చాటుతుంది.

నంబర్స్‌లో భారత్ విజయం

  • 2023-24లో రక్షణ ఉత్పత్తి ₹1.27 లక్షల కోట్లకు పెరిగింది.
  • 2014లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ₹1,000 కోట్లు. ఇప్పుడు అది ₹21,000 కోట్లకు చేరింది.
  • 12,300 కంటే ఎక్కువ రక్షణ ఉత్పత్తులను మూడేళ్లలో స్వదేశీకరించారు (భారత్‌లోనే తయారు చేస్తున్నారు).
  • ₹7,500 కోట్లకు పైగా DPSU ద్వారా దేశీయ విక్రేతల్లో పెట్టుబడి పెట్టారు.
  • రక్షణ పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌లో 25% పరిశ్రమ ఆధారిత ఆవిష్కరణలకు కేటాయించారు.

కానీ, సంఖ్యలకు అతీతంగా కొన్ని విషయాలు అందరినీ సంతోషపరుస్తాయి.

మారుతున్న మన రక్షణ వ్యవస్థ

1. తయారీ విజయం:

  • స్వదేశీ యుద్ధనౌకలు మన జలాలను కాపలా కాస్తున్నాయి.
  • భారతదేశంలో తయారైన క్షిపణులు మన రక్షణ సామర్థ్యాన్ని పెంచాయి.
  • భారతదేశంలో తయారైన బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్లు మన సైనికులను రక్షిస్తున్నాయి.
  • భారతదేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తోంది. అగ్రశ్రేణి రక్షణ పరికరాల తయారీదారుగా ఎదుగుతోంది.

2. వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు

  • ఉత్తరప్రదేశ్, తమిళనాడులలో రెండు ఆధునిక రక్షణ కారిడార్లు నిర్మించారు.

3. ఆవిష్కరణలకు ప్రోత్సాహం

  • iDEX (Innovations for Defence Excellence) స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
  • MSMEలు రక్షణ సరఫరా గొలుసులో భాగస్వాములు అవుతున్నాయి.
  • పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యం పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది.

మన యువత శక్తి, నైపుణ్యం, ప్రభుత్వ ప్రయత్నాల వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి

  • దిగుమతులపై ఆధారపడటం తగ్గింది.
  • రక్షణ తయారీ రంగంలో ఉద్యోగాలు పెరిగాయి.
  • మన యువత నైపుణ్యం పెరిగింది.
  • రక్షణ రంగంలో MSMEలకు ప్రోత్సాహం లభిస్తోంది.

ఒకప్పుడు మన సైన్యానికి ఆయుధాలు, ముఖ్యమైన పరికరాలు కొరవడేవి. ఇప్పుడు స్వయం సమృద్ధి యుగం నడుస్తోంది. ఈ ప్రయాణం ప్రతి భారతీయుడు గర్వించదగ్గది.

భారత్‌కి ఇంకా ఏం కావాలి?

భారతదేశ రక్షణ రంగం మన యువత, స్టార్టప్‌లు, తయారీదారులు, ఆవిష్కర్తలను ఆహ్వానిస్తోంది. చరిత్రలో భాగం కావడానికి ఇదే సమయం. భారతదేశానికి మీ నైపుణ్యం, ఉత్సాహం అవసరం.

ఆవిష్కరణలకు తలుపులు తెరిచి ఉన్నాయి. విధానాలు అనుకూలంగా ఉన్నాయి. అవకాశాలు అపారంగా ఉన్నాయి. మనమందరం కలిసి భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడదాం. బలమైన, స్వయం సమృద్ధి గల భారతదేశాన్ని నిర్మిద్దాం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios