Asianet News TeluguAsianet News Telugu

మెరుగుపడుతున్న ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం.. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

PM Modi mother Heeraben to be discharged from hospital soon
Author
First Published Dec 29, 2022, 11:18 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ఒకటి లేదా రెండు రోజుల్లో హీరాబెన్ మోదీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ‘‘హీరాబెన్ ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఓరల్ డైట్ ప్రారంభమైంది’’ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన కమ్యూనికేషన్ పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌ బుధవారం మధ్యాహ్నం సమయంలో హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. అయితే ఆ తర్వాత ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. 

ఇక, తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి గుజరాత్  చేరుకున్నారు. ఢిల్లీ నుండి సాయంత్రం 4 గంటల సమయంలో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి చేరుకన్నారు. అక్కడి వైద్యులను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటకుపైగా మోదీ అక్కడే గడిపారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇక, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకన్నారు. 

ప్రధాని మోదీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకనున్న పలువురు ప్రముఖులు, బీజేపీ శ్రేణులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.. హీరాబెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు. “తల్లి, కొడుకు మధ్య ప్రేమ శాశ్వతమైనది. వెలకట్టలేనిది. మోడీ జీ, ఈ కష్ట సమయంలో నా ప్రేమ, మద్దతు మీకు ఉంది. మీ అమ్మ త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios