Asianet News TeluguAsianet News Telugu

వారు రాముడి ఉనికిని ఎప్పుడూ నమ్మరు.. అలాంటి వారు.. : ప్రధాని మోడీ

గుజరాత్‌లో డిసెంబర్ 5న జరగనున్న రెండో విడత పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేడు కలోల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 'రావణ' ప్రకటనపై ప్రధాని మొదట ఎదురుదాడికి దిగారు 

PM Modi mentions Kharge Ravan comment, says Congress never believed in Ram
Author
First Published Dec 1, 2022, 2:15 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘రావణ్’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. గురువారం గుజరాత్‌లోని కలోల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖర్గే 'రావణ' ప్రకటనపై ప్రధాని మొదట ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీలో ఓ నీచమైన పద్దతి ఉండనీ, ప్రస్తుతం తనని ఎక్కువగా దూషించాలనే దానిపై ఆ పార్టీ పోటీ జరుగుతోందని అన్నారు. డిసెంబర్ 5వ విడత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీని ఎవరు ఎక్కువగా దూషించగలరు అనే దానిపై పోటీ నెలకొంది అని అన్నారు.

అనంతరం ఖర్గే వ్యాఖ్యలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. గౌరవనీయులైన ఖర్గే నన్ను రావణుడితో పోల్చారు.. అసలూ రాముడి ఉనికిని ఎప్పుడూ నమ్మని కాంగ్రెస్ పార్టీ  ఇప్పుడు రామాయణం నుంచి ‘ రావణుడిని’ తీసుకువచ్చారని, తన ఇలాంటి కఠిన పదాలను ఉపయోగించిన వారు కనీసం పశ్చాత్తాపపడలేదని అన్నారు. డిసెంబర్ 5వ జరుగనున్న రెండో విడత ఎన్నికల  సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014లో మీరు నన్ను ఢిల్లీకి పంపినప్పుడు దేశంలోరెండు మొబైల్ ఫోన్‌ ఫ్యాక్టరీలు ఉండేవని, నేడు 200కి పైగా ఉన్నాయని ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ మిత్రులు చెవులు విప్పి వినాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం, అవిశ్వాసం ఉండాలని అన్నారు. ఎంత బురద వేస్తే అంత కమలం వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

దీనికి ముందు మంగళవారం గుజరాత్ ఎన్నికల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీని రావణుడితో పోల్చారు. ఎన్నికలు ఏదైనా ప్రధాని మోడీ మొహం చూసి ఓటు వేయాలని బీజేపీ కోరుతుందనీ, ఏమైనా రావణుడిలా మోదీకి 100 తలలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇలా అన్నింటిలో ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని, ఆయన ప్రధాని అని మరిచిపోయారని విమర్శించారు. ఈ వివాదస్పద వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వివాదం ప్రారంభమైంది. 
 
గుజరాత్ లో తొలివిడత ఎన్నికలు  నేడు జరుగుతున్నాయి.రెండో విడత ఎన్నికలు ఈ నెల 5న జరుగనున్నాయి. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ  కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios