దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అలాగే దేశంలోని మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని జైరాం రమేష్ అన్నారు. బీజేపీకి మహిళల పట్ల గౌరవం లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా అసభ్య పదజాలంతో మాట్లాడారని ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా ఆమెకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేష్ డిమాండ్ చేశారు. 

CBI Busts Racket: రాజ్యసభ సీటు కావాలా..? గవర్నర్ పదవీ కావాలా..? 100 కోట్ల డీల్.. ఘ‌రానా మోసగాళ్ల గుట్టు ర‌ట్టు

ఈ మేర‌కు ఆయ‌న జేపీ న‌డ్డాకు ఆయ‌న లేఖ రాశారు. జూలై 23వ తేదీన ఒక జాతీయ వార్తా ఛానెల్‌లో జరిగిన చర్చలో శుక్లా ఉపయోగించిన “అసభ్యకరమైన, అసభ్యకరమైన” భాషపై త‌మ పార్టీ అభ్యంతరాన్ని వ్య‌క్తం చేస్తోంద‌ని చెప్పారు. ‘‘ బీజేపీ మహిళా వ్యతిరేక ఆలోచనను ప్రతిపక్షాలు చూపిస్తున్నాయి. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యల వల్ల దేశ రాజకీయాల స్థాయి దిగజారుతున్నాయి’’ అని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే..

‘‘మహిళలను గౌరవించడం వేద కాలం నుండి భారతదేశానికి వస్తున్న గొప్ప సంప్రదాయం. కాబట్టి సహజంగానే రాజకీయాల్లో మహిళలకు బీజేపీ గౌరవం ఇస్తుంద‌ని ఆశించాం. కానీ ఆ పార్టీ తన భాష, ప్రవర్తనతో పదేపదే మమ్మల్ని నిరాశపరిచింది ’’ అని ఆయన అన్నారు. ‘‘ మీ పార్టీ నాయకుల అవమానకరమైన, అసభ్యకరమైన వాక్చాతుర్యానికి దేశంలోని అందరు మహిళలకు క్షమాపణలు చెప్పాలని, అలాగే రాజకీయాల గౌరవాన్ని దెబ్బతీయవద్దని, దూషించే పదజాలం మానుకోవాలని మీ ప్రతినిధులు, నాయకులను కోరాలని ప్రధాని మోదీకి, మీకు (జేపీ నడ్డా)కు మేం విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

ఆయన ఇంకా ఆ లేఖలో ‘‘ మా అధ్యక్షురాలు లేదా మరే ఇతర నాయకులపైన మళ్లీ అనుచితమైన ఉప‌యోగిస్తే పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది ’’ అని జైరాం రమేష్ హెచ్చరించారు. కాగా అంత‌కు ముందు జైరాం ర‌మేష్ చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో శుక్లా చేసిన వ్యాఖ్యలు బీజేపీ ‘మహిళా వ్యతిరేక’ ముఖాన్ని బహిర్గతం చేశాయని అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అభ్యంతరకర భాష చూస్తే ఆ పార్టీకి మహిళల పట్ల గౌరవం లేదని స్ప‌ష్టం అవుతోంద‌ని తెలిపారు. 

SP leader Azam Khan: సుప్రీంకోర్టులో SP అధినేత ఆజం ఖాన్‌కు ఎదురుదెబ్బ‌.. 'ఆ కేసులో జోక్యం చేసుకోలేం'

ఓ బీజేపీ నేత మహిళలపై అసభ్య పదజాలం వాడడం ఇదే తొలిసారి కాదని అన్నారు. దేశంలోని గౌరవనీయులైన మహిళలపై, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని దేశం మొత్తానికి తెలుస‌ని ఆయ‌న ఆరోపించారు. ‘‘ ప్రధాని వంటి ఉన్నత పదవిలో ఉన్న ఆయ‌నే దిగ‌జారి మాట్లాడిన‌ప్పుడు, ఆయన పార్టీ అధికార ప్రతినిధి సహజంగానే ప్రతిపక్ష నేతలను దూషించే పదాలు వాడతారు’’ అని జైరాం రమేష్ తీవ్రంగా ఆక్షేపించారు.