చీపురు చేతబట్టి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. స్వచ్ఛభారత్‌ కోసం విద్యార్థులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి చీపురు పట్టారు. మోదీ శనివారం దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛతా హి సేవా’ ఉద్యమాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ.. పరిశుభ్ర భారత్‌ కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. అనంతరం ప్రధాని మోదీ స్వయంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to load tweet…

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం దిల్లీ పహర్‌గంజ్‌ ప్రాంతంలోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ శ్రమదానం చేశారు. చీపురు చేతబట్టి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. స్వచ్ఛభారత్‌ కోసం విద్యార్థులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.