Asianet News TeluguAsianet News Telugu

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ప్రధాని.. యుద్ధ విమానాల విన్యాసాలు

ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం ఉత్తర ప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్లుతున్నదని అన్నారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ కర్మయోగిలా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత ఆ ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాలు దిగాయి. టచ్ అండ్ గో ఆపరేషన్ చేశాయి. వైమానిక దళ విమానాలు విన్యాసాలన ప్రధాని వీక్షించారు.
 

pm modi inaugurated purvanchal expressway in Uttar Pradesh
Author
Lucknow, First Published Nov 16, 2021, 3:58 PM IST

లక్నో: Uttar Pradeshలో Sultanpurలోని 341 కిలోమీటర్ల Purvanchal Expresswayను ప్రధాన మంత్రి Narendra Modi ఈ రోజు ప్రారంభించారు. రూ. 22,500 కోట్లతో నిర్మించిన ఈ రహదారిని ప్రారంభించడానికి ప్రధాన మంత్రి ఈ రోజు మధ్యాహ్నం సుల్తాన్‌పూర్ చేరారు. ఎయిర్‌ఫోర్స్ సీ-130జే సూపర్ హెర్క్యూలస్ విమానంలో ఆయన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌పై దిగారు. అనంతరం కొద్ది సేపటికే ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ గత ప్రభుత్వాలు తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఆయన రాష్ట్రంలో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఉత్తరప్రదేశ్‌లో గత ప్రభుత్వాలు కేవలం తమ కుటుంబాల అభివృద్ధికే పెద్దపీట వేశాయని ప్రధాని మోడీ అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. ఏడెనిమిది సంవత్సరాల కింద ఉత్తర ప్రదేశ్‌లో రహదారుల మీదనే ప్రజలను దోపిడీ చేసే వారని, అలాంటి ఘటనలు తన దృష్టికి వచ్చినప్పుడే ఆశ్చర్యం, విచారం కలిగేవని అన్నారు. ఆ వంశపాలన కింద ఉత్తరప్రదేశ్ ప్రజల కోరికలు చీకట్లోనే ఉండిపోయాయని తెలిపారు. వారు అధికారంలో అభివృద్ధి పనులు నిర్వహించడంలో విఫలమయ్యారని, అలాంటి వారికి ఇప్పుడు సీఎం Yogi Adityanath హయాంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని వివరించారు.

Also Read: యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యల్లో నిజమెంత? అలెగ్జాండర్‌ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడా?

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌ను ఐక్యం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పటికి ఉన్న కొన్ని లోపాలను సరిపూడ్చి అనుసంధానం చేస్తుందని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి సారి ఉత్తరప్రదేశ్ బీజేపీ హయాంలో ఎక్స్‌ప్రెస్ స్టేట్‌గా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తరప్రదేశ్‌ను మరింత బలోపేతం చేస్తుందని, ఇక అభివృద్ధి బాటలో యూపీ దూసుకుపోతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం యోగి ఆదిత్యానాథ్ కర్మయోగిలా పని చేస్తున్నారని వివరించారు. 2014లో తనకు కేంద్రంలో బాధ్యతలు నిర్వహించాల్సిందిగా ప్రజలు ఆమోదాన్ని ఇచ్చారని ప్రధాని తెలిపారు. ఒక ప్రధాన సేవకుడిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నీ అభివృద్ధి చేయడం తన కర్తవ్యంగా మారిందని వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణుల వల్లే ప్రజలు వాటిని తిరస్కరించాయని, రాష్ట్ర అభివృద్ధి బాటలో అవి మళ్లీ దారిలోకి రావని అన్నారు.

Also Read: రైతు ఆందోళన.. వచ్చే ఎన్నికలు.. జమ్ము కశ్మీర్.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వీటిపై చర్చ

ప్రారంభ కార్యక్రమం అనంతరం ఎక్స్‌ప్రెస్ వేపై వైమానిక దళ విన్యాసాలు అబ్బురపరిచాయి. వైమానిక దళ యుద్ధ విమానాలు గాలిలో నుంచి వచ్చి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ల్యాండ్ అయి.. మళ్లీ గాల్లోకి ఎగిరే విన్యాసాలు చేశాయి. అనంతరం సుఖోయ్, మిరేజ్ 200 సహా పలు వైమానిక దళ యుద్ధ విమానాలు ఎక్స్‌ప్రెస్ వేపై ల్యాండ్ అయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు ఆసక్తి రేపుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios