చైనా సరిహద్దు వెంబడి, చైనా సైనికుల దుష్టనీతికి 21 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. జూన్ 15న జరిగిన ఈ దుర్ఘటన తరువాత నేటి ఉదయం ప్రధాని నరేంద్రమోడీ లెహ్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి నేరుగా అక్కడకు చేరుకున్నారు. 

ఆయన అక్కడి పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తరువాత సైనికాధికారులు అక్కడి పరిస్థితులను వివరించనున్నారు. అమరులకు వందనం సమర్పించనున్నారు. అనంతరం ఆయన అక్కడ ముఖ్యమనిన సీనియర్ అధికారులతో కాసేపు పరిస్థితిపై చర్చించనున్నారు. 

ఇకపోతే తాజాగా... సరిహద్దుల్లో గల్వాన్‌ లోయలో ఇటీవల నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో చైనా యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇంతకుముందే దిగుమతులపై ఆంక్షలను విధించడం తెలిసిందే. అయితే, చైనా భౌతిక ఉత్పత్తులపై నిషేధం విధిస్తే ఆ ప్రభావం భారత్‌పై కూడా పరోక్షంగా పడే అవకాశం ఉన్నదని నిపుణులు అంటున్నారు. 

భారత్‌ డిజిటల్‌ మార్కెట్‌ను తన ఆదాయ వనరుగా మార్చుకుంటున్న చైనా ప్లాట్‌ఫాంలు, యాప్‌లపై నిషేధం విధిస్తే డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చినట్టు అవుతుందని చెప్తున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌ తదతర చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

‘చైనా నుంచి దిగుమతి అయ్యే బొమ్మలు, ఔషధాలను నిషేధిస్తే కొంతవరకు భారత్‌ కూడా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే సాంకేతికంగా, వర్చువల్‌ రంగంలో చైనాకు ఆదాయ వనరుగా ఉన్న మన దేశంలో అక్కడి యాప్‌లను నిషేధిస్తే పెద్ద దెబ్బ కొట్టినవాళ్లమవుతాం’ అని ముంబైలోని గేట్‌వే హౌస్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణుడు అమిత్‌ భండారి తెలిపారు. 

also read అమెజాన్ ఉద్యోగుల సమ్మె.. ప‌ట్టించుకోవ‌డం లేదంటు ఆందోళ‌న.. ...

2019 గణాంకాల ప్రకారం దేశంలో 50 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 70 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దేశంలో ఇంటర్నెట్‌ సేవలు చౌకగా లభిస్తుండటంతో దాదాపు అందరి ఫోన్లకు నెట్‌ కనెక్షన్‌ కూడా ఉంటున్నది. 

 

వినోదం, సమాచారం, సేవల కోసం వినియోగదారులు ఫోన్లలో కనిష్ఠంగా రెండు యాప్‌ల నుంచి గరిష్ఠంగా 11 యాప్‌ల వరకు వినియోగిస్తున్నారు. ఇందులో అగ్ర తాంబూలం చైనా యాప్‌లదే. ముఖ్యంగా టిక్‌టాక్‌, వీచాట్‌, హలో, షేర్‌ఇట్‌, యూసీ బ్రౌజర్‌కు యువతలో మంచి క్రేజ్‌ ఉన్నది.

ప్రపంచవ్యాప్తంగా చైనా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయులే. సెన్సార్‌ టవర్‌ నివేదిక ప్రకారం.. చైనాకు చెందిన టిక్‌టాక్‌కు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి ఉన్నారు. ఇందులో 20 కోట్ల మంది వినియోగదారులు భారతీయులే.

2019లో మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ 45.67 కోట్ల డాలర్ల ఆదాయాన్ని అర్జించింది. ఇందులో భారత్‌ వాటా కూడా అధికమే. షేర్‌ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీచాట్‌ తదితర యాప్‌లు కూడా భారత్‌ కేంద్రంగా వందల కోట్లల్లో లాభాల్ని అర్జిస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో వాటి రెవెన్యూకు పెద్ద మొత్తంలో గండిపడనున్నది.