PM Modi Hyderabad Visit: హైదరాబాద్‌లో శనివారం నాడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రానుండగా.. బై బై మోడీ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ కావడం గమనార్హం.
BJP national executive meet: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ వంటి వారితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధికార ప్రతినిధులు హాజరుకాన్నారు. మొత్తం 365 మందికి పైగా ప్రముఖులు రానున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలతో స్పందిస్తున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర వివక్ష చూపుతున్నదని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అధికారం కోసం రాష్ట్రంలో బీజేపీ అగ్రగణం దిగుతున్నదని మండిపడుతున్నారు. వివిధ రకాల ఫొటోలను షేర్ చేయడంతో పాటు ఘాటు విమర్శలు గుప్పిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బైబై మోడీ అనే హాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. #ByeByeModi అంటూ సోషల్ మీడియాలో పోస్టుల్లో కొన్ని ఇలా ఉన్నాయి..
ఓ నెటిజన్ తన పోస్టులో money heist క్యారెక్టర్లతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అందులో మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటాము.. నువ్వు మంత్తం దేశాన్ని దోచుకుంటున్నావు.. బై బై మోడీ ప్లాకార్డులపై రాసుకొచ్చారు.
కాగా, అంతకుముందు రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కేటీఆర్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. బై బై మోడీ చెప్పాల్సిన సమయం అసన్నమైదంటూ ట్వీట్ చేశారు. బీజేపీ పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు అంటూ కేటీఆర్ రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆవో-దేఖో-సీకోఅంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడలని కేటీఆర్ సూచించారు.
