ఎర్రకోటపై స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా నేడు ప్రధాని  ప్రసంగం కోసం దేశం ఆత్రుతగా ఎదురుచుస్తున్న విషయం తెలిసిందే. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహార్ వాజ్ పేయూ, పలువురు కేంద్రమంత్రులు, దేశ ప్రజలు హాజరయ్యారు.