ఆమెకు కండరాల ఆపరేషన్ కోసం యూఎస్ వెళ్లడానికి సహకరించారని.. అలా చేయకపోయి ఉంటే.. ఈ రోజు దేశానికి పతకం వచ్చేది కాదని బిరేన్ సింగ్ పేర్కొన్నారు.  

టోక్యొ ఒలంపిక్స్ లో మీరాబాయి చాను అదరగొట్టేసింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె రజతం గెలిచిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ టోక్యో ఒలంపిక్స్ కి ముందు.. ఆమెకు వైద్యం కోసం ప్రధాని నరేంద్రమోదీ సహాయం చేశారని మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి మోదీ కృషి చేశారని చెప్పారు. ఈ క్రమంలో.. మీరాభాయ్ చాను కి సహాయం చేసినందుకు గాను.. దన్యావాదాలు తెలియజేసినట్లు బిరేన్ సంగ్ పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తనకు అందిన సహాయాన్ని మీరా భాయ్ చాను తనకు స్వయంగా వివరించిందని బిరేన్ సింగ్ పేర్కనా్నరు. ఆమె రజతం గెలిచినందుకు సత్కరించడానికి ఓ కార్యక్రమానికి ఆహ్వానించగా.. అక్కడ ఆమె ఈ విషయాన్ని చెప్పిందన్నారు.


ఆమెకు కండరాల ఆపరేషన్ కోసం యూఎస్ వెళ్లడానికి సహకరించారని.. అలా చేయకపోయి ఉంటే.. ఈ రోజు దేశానికి పతకం వచ్చేది కాదని బిరేన్ సింగ్ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా..మొదటి నుంచి పతకం సాధించే లిస్టులో ఉన్న చాను.. అనుకున్నమేర రాణించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తి పతకం మీద ఆశలు పెంచింది. మొత్తంమీద 202 కేజీలు ఎత్తిన చాను.. స్వర్ణ పతకం కోసం జరిగిన మూడవ అటెంప్ట్‌లో విఫలమైంది. దాంతో రెండవ స్థానంలో నిలవడంతో రజత పతకం సొంతమైంది.ఆమె విజయంతో దేశమంతా హర్షాతిరేకాలు వెల్లడయ్యాయి