Asianet News TeluguAsianet News Telugu

మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: ఈ-సిగరెట్ల వినియోగంపై నిషేధం

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరెట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. 

PM Modi Govt has given approval to ban e-cigarettes
Author
New Delhi, First Published Sep 18, 2019, 5:51 PM IST

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరెట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

ఇక నుంచి ఈ-సిగరెట్ల తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ చేయడం, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు నిర్మల వెల్లడించారు.

ఈ-సిగరెట్లు యువతపై దుష్ప్రభావాన్ని చూపెడుతోందని.. ఇదే సమయంలో తాము సాధారణ సిగరెట్లను ప్రోత్సహించడం లేదని ఆమె స్పష్టం చేశారు.

అమెరికా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని.. పొగాకు వినియోగం తగ్గించాలనేది ప్రభుత్వ ఆశయమని నిర్మల వెల్లడించారు.

అంతకుముందు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా.. కేంద్రప్రభుత్వం ఆమోదించింది. పిల్లలు, యువతలో ఇదొక వ్యసనంగా మారకుండా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అలాగే ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios