నారీ శక్తి బలోపేతానికి మరో అడుగు: ప్రధాని మోడీపై షెహజాద్ పూనావాలా ప్రశంసలు

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాబాద్ పూనావాలా ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఎల్పీజీ ధరపై రూ. 100 తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు.
 

pm modi govt decisions steps towards women empowerment says shehzad poonawalla kms

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రధానమంత్రి మోడీపై, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. నారీ శక్తిని బలోపేతం చేయడానికి మరో అడుగు పడిందని అన్నారు. మహిళా సాధికారతకు, పేదరికం నుంచి బయటపడటానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దోహదపడుతాయని వివరించారు. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించి మహిళా సాధికారతకు కీలక అడుగు పడేలా చేశారని తెలిపారు.

ఎల్పీజీ సిలిండర్ పై రూ. 100 తగ్గించే చారిత్ర నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని పూనావాలా అన్నారు. ఇది నారీ శక్తికి నిజంగా చాలా పెద్ద నిర్ణయం అని తెలిపారు. తమ ప్రభుత్వం ఉజ్వల స్కీమ్‌ను మరో ఏడాదికి పొడిగించారనీ వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే అన్ని పథకాలను మహిళలను కేంద్రంగా తీసుకుని రూపొందిస్తారని పూనావాలా అన్నారు. ఉజ్వల యోజనా, బేటీ బచావో యోజనా, పోషణ్ యోజనా, లాడ్లీ లక్ష్మీ యోజనా, సుకన్య సమృద్ధి యోజనా వంటివన్నీ నారీ శక్తి బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలే అని విరించారు.

Also Read: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. బీఆర్ఎస్ నేత సీతారాం నాయక్‌ టార్గెట్!

ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సరైన నిర్ణయం తీసుకున్నారని పూనావాలా అన్నారు. దేశంలోని మహిళలు అందరినీ ప్రధాన స్రవంతితో కలిపేలా కోట్లాది మంది మహిళలకు ప్రేరణగా ఉన్న సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల ట్రిపుల్ తలాఖ్ సాంప్రదాయాన్ని ముగించారని పూనావాలా అన్నారు. తద్వార ముస్లిం సోదరీమణుల హక్కులను నిలబెట్టారని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ మహిళల కోసం పోరాడుతానని చెప్పారని, కానీ, ఆమె సందేశ్‌ఖాలీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇంకా ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios