భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో ఐరోపా దేశాల పర్యటన చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది తొలిసారి విదేశీ పర్యటన చేయనున్నారు. వచ్చే నెలలో ఆయన యూరప్ పర్యటించనున్నారు. మే 2వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయన జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ మూడు దేశాల పర్యటనలో ఆయన సుమారు 65 గంటలు గడుపనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ప్రధాని మోడీ పలువరు నేతలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక, బహుళ పాక్షిక భేటీలు చేయబోతున్నారు. ఎనిమిది దేశాల అగ్ర నేతలతో ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. వీరితోపాటు సుమారు 50 మంది అంతర్జాతీయ స్థాయి వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశం అవుతారు.
అదే విధంగా ఆయా దేశాల్లోని వేలాది మంది ప్రవాస భారతీయులను కలుసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
ప్రధాని మోడీ తన యూరప్ పర్యటనను జర్మనీ నుంచి ప్రారంభిస్తారు. ఆ తర్వాత డెన్మార్క్‌కు వెళ్తారు. అనంతరం తన తిరుగు ప్రయాణంలో అంటే మే నెల 4వ తేదీన ఫ్రాన్స్‌లో స్వల్పంగా గడుపుతారు. మొత్తంగా ప్రధాని మోడీ జర్మనీలో ఒక రాత్రి, డెన్మార్క్‌లో మరో రాత్రి గడపున్నట్టు వివరించాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ యూరప్ పర్యటన చేస్తున్నారు. మెజార్టీ యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న సందర్భంలో ఆయన ఈ టూర్ వేస్తుండటం గమనార్హం.
రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా చమురు, ఇతర సరుకులను చౌకగా ఎగుమతి చేయడానికి నిర్ణయించింది. ఇందుకు భారత్ కూడా సమ్మతించింది. దీనిపై అమెరికా సహా యూరప్ దేశాలు కొన్ని గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఐరోపా దేశాల్లో పర్యటిస్తున్నారు.
ఇదిలా ఉండగా, శనివారం దేశరాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో వీరిద్దరూ ప్రధాని, సీజేఐ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని, న్యాయవ్యవస్థకు, సామాన్యులకు మధ్య అంతరాన్ని దూరం చేస్తుందని, న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ఉపయోగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. "మేము న్యాయస్థానాలలో స్థానిక భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇది న్యాయ వ్యవస్థపై సాధారణ పౌరులకు విశ్వాసాన్ని పెంచడమే కాకుండా, వారు దానితో మరింత అనుబంధాన్ని కలిగి ఉంటారు" అని ప్రధాని మోడీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సామాన్యులకు చట్టంలోని చిక్కులు కూడా తీవ్రమైన అంశమని చెప్పారు.
