Asianet News TeluguAsianet News Telugu

5జీ లింక్ ద్వారా ఢిల్లీలో కూర్చుని స్వీడన్‌లోని కారు నడిపిన ప్రధాని మోడీ.. (వీడియో)

ప్రధాని మోడీ ఈ రోజు 5జీ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అదే కార్యక్రమంలో ఎరిక్సన్ స్టాల్‌లో కూర్చుని యూరప్‌లోని స్వీడన్‌లో ఉంచిన కారును నడిపారు. 5జీ టెక్నాలజీ సహాయంతో ఆయన ఇక్కడి నుంచే యూరప్‌లోని వాహనాన్ని నడిపారు. 
 

pm modi drives car in sweden remotely from delhi using 5G link
Author
First Published Oct 1, 2022, 3:09 PM IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో కూర్చుని యూరప్ కంట్రీ స్వీడన్‌లోని కారును నడిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సహాయంతో ఆయన ఎరిక్సన్ స్టాల్‌లో ఈ ఫీట్ చేశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శనివారం ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఎరిక్సన్ స్టాల్‌లో రూపుదిద్దుకున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. స్వయంగా కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేశారు.

భారత్ ప్రపంచాన్ని నడుపుతున్నదని పేర్కొంటూ ఈ ఫొటో ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ 5జీ టెక్నాలజీ సహాయంతో ఢిల్లీ నుంచి యూరప్‌లోని కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారని వివరించారు.

యూరప్‌లోని స్వీడన్‌లో ఓ ఇండోర్ కోర్స్‌లో ఈ వాహనాన్ని ఉంచారు. దాన్ని నావిగేట్ చేయడనికి కంట్రోల్ సెటప్‌ను ఢిల్లీలోని ఎరిక్సన్ స్టాల్‌లో ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ఆ సీటు పై కూర్చుని ఎదురుగా ఉన్న హ్యాండిల్‌ను, యాక్సెలేటర్, బ్రేక్‌లను యూజ్ చేస్తూ కారును డ్రైవ్ చేశారు.

ప్రధాని మోడీ ఈ రోజు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ కార్యక్రమంలో 5జీ సేవలను ప్రారంభించారు. మన దేశంలో 5జీ సేవల ఎదురుచూపులు ఎట్టకేలకు ముగిశాయి. దీపావళిలోపు ఈ సేవలు యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు. ఎయిర్‌టైల్, రిలయన్స్ జియో, క్వాల్కామ్ వంటి దిగ్గజ కంపెనీలు 5జీ సర్వీసులను డెమోన్‌స్ట్రేట్ చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios