ట్రంప్‌కి మోదీ ఫోన్.. ఆ అంశాలపైనే చర్చ
అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల నాయకులు ప్రపంచ శాంతి, టెక్నాలజీ, రక్షణ, శక్తి, అంతరిక్ష రంగాలలో సహకారంపై చర్చించారు.
అమెరికా ఎన్నికలు (US Elections)లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేశారు. ట్రంప్‌తో పాటు ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీకి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల నాయకులు ప్రపంచ శాంతి కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మోదీతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ... ప్రపంచం మొత్తం ప్రధాన మంత్రి మోదీని ప్రేమిస్తుందని తెలిపారు. అలాగే, భారత్ అద్భుతమైన దేశమని, ప్రధాన మంత్రి మోదీ ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.
ప్రధాని మోదీని, భారత్‌ను నిజమైన స్నేహితులుగా భావిస్తానని ట్రంప్ చెప్పారు. తన విజయం తర్వాత మాట్లాడిన మొదటి ప్రపంచ నాయకుల్లో ప్రధాన మంత్రి మోదీ ఒకరని తెలిపారు.
అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ కాల్ మాట్లాడటంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
‘మా స్నేహితుడు, ప్రెసిడెంట్ ట్రంప్‌తో గొప్ప సంభాషణ జరిగింది. అతని అద్భుత విజయంపై శుభాకాంక్షలు తెలిపాను. టెక్నాలజీ, రక్షణ, శక్తి, అంతరిక్షం, ఇతర అనేక రంగాల్లో భారత్- అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తిరిగి కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను’ అని మాట్లాడినట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.