న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వైద్య ,ఆరోగ్యశాఖ అధికారులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు, కేబినెట్ సెక్రటరీ కూడ హాజరయ్యారు.

గత 24 గంటల్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.ఒక్క రోజులోనే 93,249 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం కరోనా కేసుల సంఖ్య 1.24 కోట్లకు చేరుకొంది.   దేశంలో 2019 సెప్టెంబర్ 19వ తేదీన 93,337 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఆ తర్వాత అదే సంఖ్యకు సమానంగా 93,249 కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో పీఎం నిర్వహిస్తున్న సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 

కొత్త నిబంధనలను, మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.