PM Modi US Visit: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడో రోజు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు అమెరికా, భారత్‌లోని అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలతో కీలక సమావేశమయ్యారు. 

PM Modi US Visit: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మూడో రోజు కూడా చాలా బిబీబిబీగా గడుపుతున్నారు. నేడు వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు జో బిడెన్‌లు సంయుక్తంగా అమెరికా, భారత్‌లోని అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలతో కీలక సమావేశమయ్యారు. టాప్ సీఈఓలతో నిర్వహించిన హైటెక్ హ్యాండ్‌షేక్ కార్యక్రమంలో పలు కీలక ఆంశాలపై చర్చించారు. 

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రతిభ,సాంకేతికత కలిస్తే ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో భరోసా అని ప్రధాని మోదీ అన్నారు. భారత యువత తమ ప్రతిభ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిభ, సాంకేతికత యొక్క సమ్మేళనం ఉజ్వల భవిష్యత్తుకు హామీని ఇస్తుందని అన్నారు. ప్రెసిడెంట్ జో బిడెన్ దార్శనికత భారతదేశ యువత ఆకాంక్షలు, అవకాశాలతో ముందుకు సాగడానికి ఇది ఒక అవకాశమని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ఏమన్నారు?

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. భారత్ అమెరికాల సహకారం ఇరుదేశాల ప్రజలకే కాకుండా ప్రపంచానికే ముఖ్యమని అన్నారు. నూతన ఆవిష్కరణలు, పరస్పర సహకారాలను అమెరికా భారత్ భాగస్వామ్యం మరింత ముందు తీసుకెళ్తోందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ప్రజలను పేదరికం నుండి బయటపడేయడం, మహమ్మారిని ఆపడం , మన పౌరులకు నిజమైన అవకాశాలను ఇవ్వడం చాలా ముఖ్యమనవి అన్నారు. 

ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు

ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, జీరోధా, ట్రూ బీకాన్ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం అమెరికా విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన లంచ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రధాని గౌరవార్థం లంచ్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్ర యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు. భారతదేశం ప్రపంచంలోని కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. అది తత్వశాస్త్రం లేదా శాసనోల్లంఘన లేదా ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత కలిగి ఉండటం సూర్ఫిదాయకమని అన్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా అనేక దేశాలతో పాటు భారతదేశంలో కూడా పర్యటించాననీ, భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ఆగ్నేయాసియాకు చేరుకుందనీ, దీని సహాయంతో చాలా మంది ప్రాణాలను రక్షించబడ్డాయని తెలిపారు.

ప్రధాని మోదీ ధన్యవాదాలు 

ఈ వేడుకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తనకు ఘన స్వాగతం పలికినందుకు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు తొలుత ధన్యవాదాలు తెలిపారు. గత మూడు రోజులుగా తాను అనేక సమావేశాలలో పాల్గొని అనేక అంశాలపై చర్చించాను. అన్ని సమావేశాలలో ఒక విషయం సర్వసాధారణమనీ, అదే భారత్, అమెరికా మధ్య స్నేహం, సహకారం మరింత మెరుగుపడాలని( ధ్రుడ) అందరూ అంగీకరించారని తెలిపారు. 

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తల్లి 1958లో భారత్‌ నుంచి అమెరికాకు వచ్చిందని, ఆ సమయంలో చాలా మందికి ఫోన్‌ లేదని, అందుకే ఆమె తన చేతితో లేఖలు రాస్తూ కుటుంబ సభ్యులకు లేఖలు పంపేవారని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌తో సంబంధాలు తెగిపోనివ్వలేదు. భారతదేశం-అమెరికా మధ్య స్నేహం నిత్యం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఇరు దేశాలు ప్రపంచ శాంతి,శ్రేయస్సుకు తోడ్పడుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.