భారతదేశాన్ని ఐటీ రంగంలో మరింత ఇతుకు చేర్చేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా ప్రధానమంత్రి వెల్లడించారు. భారతదేశాన్ని ఒక టెక్ హబ్ గా తీర్చిదిద్దేందు, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింతగా మెరుగుపరిచేందుకు ఈ పద్దతులను తీసుకువచ్చినట్టుగా తెలిపారు. 

బీపీఓ రంగానికి మరింత ఊతమిచ్చేనందుకు ఈ నూతన విధానంలో ఓఎస్పీ ల కోసం రిజిస్ట్రేషన్ ని తొలగించారు. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ రంగానికి దీనివల్ల పెద్ద ఊతం లభించనుంది. భారత్ మరిన్ని కంపెనీల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులను దక్కించుకొని ఆర్ధిక రంగానికి ఊతమివ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. 

ఐటీ సెక్టార్ భారతదేశానికి గర్వకారణమని, ఈ రంగం వృద్ధి చెందడానికి తీసుకోవాలిసిన అన్ని చర్యలను తాము తీసుకుంటామని, ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా తెలిపారు.