Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం.. సార్ట్  క్యాంపెయినర్లను ప్రకటించిన బీజేపీ.. ఆ జాబితాలో ...

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 నేపథ్యంలో బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం  విడుదల చేసింది. ఈ జాబితాలో 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఆ స్టార్ క్యాంపెయినర్లలో మొదటి వ్యక్తిగా  ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తవించారు. అలాగే..  ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరుల పేర్లు ఉన్నాయి

PM Modi, Amit Shah & Rajnath Singh among BJP's Himachal star campaigners
Author
First Published Oct 21, 2022, 11:47 PM IST

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022: వచ్చే నెలలో జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులను  ప్రకటిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు.. తమ బలబలాలను ప్రదర్శించాయి. 

ఈ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ ఎన్నికల్లో అధికారం ఎలాగైనా కైవసం చేసుకోవాలని  బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తం 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 62 సీట్లకు తొలి జాబితాలోనే అభ్యర్ధుల్ని ప్రకటించగా.. శుక్రవారం ఆ పార్టీ తమ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. 

అదేసమయంలో బిజెపి తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా మొత్తం 40 మంది పేర్లు ఉన్నాయి. అదే సమయంలో హోంమంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ,రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్ మరియు పలువురు మాజీ,  ప్రస్తుత కేంద్ర మంత్రులతో సహా బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.
 
బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ సింగ్ ఠాకూర్, వీకే సింగ్, హర్దీప్ పూరి, బీజేపీ సంస్థ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్, శాంత కుమార్ లుఉన్నారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా బీజేపీ చేర్చుకుంది. ఇందులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్లు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios