ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ ట్వీట్ చేశారు. 


ఢిల్లీ : Disco King గా పేరొంది.. అనేక పాటలకు తన మ్యూజిక్ తో గాత్రంతో ప్రాణం పోసి ఓ దశకాన్ని తన పేరుతో లిఖించుకున్న Bappilahari ఈ రోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గాత్రమే కాదు.. ఆహార్యమూ ఆసక్తికరంగానే ఉండేది. ఒళ్లంతా బంగారంతో ఎప్పుడూ కనిపించేవారు.

పరిశ్రమలోని వారంతా ప్రేమగా Bappi da అని పిలుచుకునే ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. దేశ సంగీత చరిత్రలో బప్పీలహరి పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. ఎన్నో డిస్కో పాటలకు ఆయన స్వరకల్పన చేశారు. హిందీలోనే కాదు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో పాటలు సమకూర్చారాయన. బప్పీలహరి మృతి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

బప్పి లాహిరి మృతికి ప్రధాని Narendra Modi ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. ‘బప్పి లాహిరి జీ సంగీతం పూర్తిగా మనల్ని ఆవరించి, వైవిధ్యమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తీకరిస్తుంది. ఎంతోమంది వయసు బేధం లేకుండా ఆయన సంగీతాన్ని ఇష్టపడతారు. ఆయన మరణంతో అతని సజీవ స్వభావాన్ని అందరూ మిస్ అవుతారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. 

ఇక కేంద్ర హోం శాఖ మంత్రి Amit Shah కూడా బప్పీలహరి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ‘లెజెండరీ గాయకుడు, కంపోజర్ బప్పి లాహిరి జీ మరణవార్త తెలిసి బాధపడ్డాను. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచంలో పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింగ్ కేజ్రీవాల్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లు కూడా ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.

Scroll to load tweet…
Scroll to load tweet…