చాలా మంది అప్పట్లో జరిగిన హింస కారణంగా ప్రాణాలు కోల్పోయారని మోదీ పేర్కొన్నారు. అప్పటి మన ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. ఆగస్టు 14వ తేదని మనం విభజన మయోత్పాత స్మృతి దినంగా జరుపుకుందాం అంటూ.. మోదీ పిలుపునిచ్చారు.
ఆగస్టు 14వ తేదీని విభజన బయోత్పాత స్మృతి దినంగా ప్రకటించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. భారత్‌కి స్వాతంత్ర్యం ఇచ్చే ముందు బ్రిటీష్ పాలకులు... ఇండియాని రెండుగా విభజించి... పాకిస్థాన్‌ని స్వతంత్ర దేశంగా మార్చారు. అప్పట్లో ఈ నిర్ణయం చాలా మందికి నచ్చలేదు. ఈ విభజన వల్ల ఇండియాలో చాలా మంది పాకిస్థాన్‌కీ, పాకిస్థాన్‌లో చాలా మంది ఇండియాకీ వలస వచ్చారు. ఇదంతా అప్పట్లో పెద్ద చారిత్రాత్మక అంశం అయ్యింది. అప్పటి ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విభజన బాదలన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమని మోదీ పేర్కొన్నారు. లక్షల మంది సోదర సోదరీమణులు తరలిపోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. చాలా మంది అప్పట్లో జరిగిన హింస కారణంగా ప్రాణాలు కోల్పోయారని మోదీ పేర్కొన్నారు. అప్పటి మన ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. ఆగస్టు 14వ తేదని మనం విభజన మయోత్పాత స్మృతి దినంగా జరుపుకుందాం అంటూ.. మోదీ పిలుపునిచ్చారు.
