మైనర్ బాలికలు గర్భం దాల్చిన ఘటనలు తమిళనాడులో ఇటీవల బాగా ఎక్కువైపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పడవేడు గ్రామంలో 12 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే 16 ఏళ్ల బాలుడు ఏడాదిగా లైంగిక దాడి చేస్తుండటంతో ఆమె గర్భం దాల్చింది.

తాజాగా ఇంటర్ చదువుతున్న బాలిక బిడ్డకు జన్మినివ్వడం కలకలం రేపుతోంది. తిరుప్పూర్ జిల్లా వడుకపాళెలం గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భంతో ఉన్నట్లు తెలిపారు.. వెంటనే డెలీవరీ చేయకపోతే తల్లీ బిడ్డకు ప్రమాదమని హెచ్చరించారు. వెంటను ప్రసవ వార్డుకి తరలించి డెలీవరి చేయడంతో శుక్రవారం సదరు బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

దీనిపై ఆమె తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. తోటి విద్యార్ధితో ప్రేమలో పడి.. వీరిద్దరూ హద్దులు దాటడంతో ఆమె గర్భం దాల్చినట్లుగా తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం బాలుడి ఇంట్లో తెలియడంతో అతడిని చదువు మాన్పించేసి కూలి పనులకు పంపిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

శారీరకంగా కలవడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా కళాశాలకు వెళ్తోందని.. నెలలు నిండటంతో ప్రసవం జరిగింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.