Places Of Worship Act: ప్రార్థనా స్థలాల చట్టం1991ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారించింది. ఈ చట్టంలోని ప‌లు నిబంధనలు ఏకపక్షమ‌నీ, అవి రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ దాఖ‌లైంది. ఈ నిబంధనలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని పిటిష‌న్ దాఖ‌లైంది. 

Places Of Worship Act: ప్రార్థనా స్థలాల చట్టం-1991 (Places Of Worship Act) కి రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ.. దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. కాగా, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రెండు పిటిషన్లను మాత్రమే విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ విష‌యంలో కొత్త‌ పిటిషన్లను స్వీకరించబోమని, కొత్త పిటిషన్లకు బదులు అవే పిటిషన్లలో దరఖాస్తులను దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. ఈ కేసు ప్రధాన విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ప్రార్థనా స్థలాల చట్టం 1991ని సవాలు చేస్తూ 2021 మార్చిలో న్యాయవాదులు అశ్వనీ కుమార్, విష్ణు జైన్ పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు నోటీసు ఇచ్చింది. 

న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై విచారణకు లిస్ట్ చేయబడింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి అనిల్ కబోత్రా, న్యాయవాదులు చంద్రశేఖర్, రుద్ర విక్రమ్ సింగ్, దేవకినందన్ ఠాకూర్జీ, స్వామి జితేంద్రానంద సరస్వతి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ చింతామణి మాలవ్య దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించింది.

పిటిషన్లలో ఏం పేర్కొన్నారు?

రాజ్యాంగం ఇచ్చిన న్యాయ సమీక్ష హక్కును ఈ చట్టం నిషేధిస్తోందని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం కోర్టును తరలించే ప్రాథమిక హక్కు కారణంగా చట్టంలోని నిబంధనలు శూన్యం. ఈ చట్టం పూజించే హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు.

ప్రార్థనా స్థలాల చట్టం 1991 లోని సెక్షన్లు 2, 3, 4 ల‌ రాజ్యాంగ చెల్లుబాటును రిటైర్డ్ ఆర్మీ అధికారి అనిల్ కబోత్రా సవాలు చేశారు, ఈ సెక్ష‌న్లు లౌకికవాద సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. న్యాయవాది అశ్విని కుమార్ దూబే ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో.. అసమంజసమైన చర్య చేయడం ద్వారా, కేంద్రం ఏకపక్షంగా అహేతుకమైన రెట్రోస్పెక్టివ్ కటాఫ్ తేదీని సృష్టించింది. ప్రార్థనా స్థలాల స్వభావం ఆగస్టు 15, 1947 నాటి మాదిరిగానే కొనసాగుతుందని ప్రకటించింది. అనాగరిక ఆక్రమణదారులు, ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారి ఆక్రమణకు వ్యతిరేకంగా కోర్టులో ఎటువంటి విచారణ జరగదు. అటువంటి ప్రక్రియలన్నీ ముగుస్తాయి.

ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి?

1991 బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టాన్ని 1991, సెప్టెంబర్‌ 18న రూపొందించారు. అప్పటి పీవీ నర్సింహారావు ప్రభుత్వం బాబ్రీ మసీదు-రామ మందిర వివాదం నేపథ్యంలో ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చ‌ట్టం ఏ ప్రార్థనా స్థలాల మార్పిడిని నిషేధిస్తుంది. 15 ఆగస్టు, 1947కు ముందు ఉన్న‌ ఏ ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావాన్ని మార్చ‌డానికి వీల్లేదు. ఆగస్టు 15, 1947న ప్రబలంగా ఉన్న ప్రార్థనా స్థలాన్ని పునరుద్ధరించాలని, దాని స్వభావాన్ని మార్చాలని కోరుతూ.. 1991 చట్టంలోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ.. ఉపాధ్యాయ్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో కేంద్రం ప్రతిస్పందనను కోరింది. దావా దాఖలు చేయడాన్ని నిషేధించింది.

అయోధ్య రామజన్మ భూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌డిన‌ తరువాత దేశంలో ఇలాంటి వివాదాలకు అవకాశం లేదని ప‌లువురు భావించారు. కానీ, కొద్ది రోజులకే.. జ్ఞానవాపీ మసీదు, మధుర శ్రీకృష్ణ ఆలయం-షాహీ ఈద్గా, కుతుబ్‌ మీనార్ లాంటి ప‌లు వివాదాలు తెరమీదకు వ‌చ్చాయి. దీంతో భార‌త దేశ లౌకికత్వాన్ని ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఈ స‌మ‌యంలో పై వివాదంల్లో ప్రాచీన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి.. ఆ స్థ‌లంలో మసీదులను, ఇత‌ర ముస్లీం క‌ట్ట‌డాల‌ని నిర్మించారని అనే వివాదాలు తెర మీదికి వ‌చ్చాయి. దీంతో లౌకికత్వం ఉనికి ప్రమాదంలో ప‌డింది. ఈ క్ర‌మంలో ‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’ మరోసారి తెర మీద‌కు వ‌చ్చింది.