లాక్‌డౌన్ సక్సెస్ కాకపోతే.. మే 3 తర్వాత వాట్ నెక్ట్స్‌: మోడీని ప్రశ్నించిన పీకే

కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ నేత ప్రశాంత్ కిశోర్ స్పందించారు. 
pk asks if centre has alternate plan after lockdown extension
ఒకవేళ లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇవ్వకపోతే ఇందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా అని ఆయన ప్రశ్నించారు. లాక్‌‌డౌన్‌పై చర్చ ఇప్పట్లో ముగిసేది కాదని, అయితే వాస్తవం ఏంటంటే ఒకవేళ లాక్‌డౌన్ వల్ల ఆశించిన ఫలితం రానట్లయితే మే 3 తర్వాత ఏం జరగబోతోందన్నారు.

ఆ తప్పిదాన్ని సరిచేయడానికి మన దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అని ప్రశాంత్ కిశోర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తొలిసారిగా మార్చి 24 అర్థరాత్రి విధించిన లాక్‌డౌన్ సరైందేనన్న ప్రశాంత్ కిశోర్... దానిని పొడిగించే అవకాశాలు ఉన్నాయని గతంలోనే పేర్కొన్నారు.

అయితే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం సరైన రీతిలో సంసిద్ధం కాలేదని పీకే చెప్పారు. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉందని ఆయన గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.

కాగా సోమవారం నాడు ఉదయం ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోందన్నారాయన..ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షించారన్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సాగిస్తున్నారన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

కరోనాపై బారత్ బలంగా పోరాటం చేస్తున్న విషయాన్ని మోడీ గుర్తుచేశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరాన్ని జరుపుకొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కరోనాపై పోరాటం చేయడంలో దేశం మొత్తం ఒకేతాటిపై ఉందన్నారు ప్రధాని. దేశంలో ఒక్కకరోనా కేసు నమోదు కాకముందే దేశంలోకి వచ్చేవారిని స్క్రీనింగ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో కరోనా మహహ్మరిగా మారకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నట్టుగా మోడీ వివరించారు. 21 రోజుల పాటు లాక్‌డౌన్ సమర్ధవంతంగా అమలు చేసినట్టుగా చెప్పారు. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios