చిరిగిన నోటు కాకుండా మంచి నోటు ఇవ్వమని అడిగినందుకు ఓ పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉత్తర‌ప్ర‌దేశ్ లోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. బాధితుడు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

మీకు ఎవ‌రైనా ఎవరైనా చిరిగిన నోటు ఇస్తే ఏం చేస్తారు? మ‌రో నోటు ఇవ్వ‌మ‌ని అడుగుతాం .. లేదా వేరే నోటు ఇవ్వ‌మ‌ని కాస్త వాదిస్తామని అయితే.. కానీ మ‌రి ప్రాణాల మీద‌కు వ‌చ్చేలా.. వారు మన మీద దాడి చేసేలా అయితే.. ప్ర‌వ‌ర్తించాం కాదా..! కానీ.. అలా చిరిగినా నోటు కాకుండా.. మ‌రోనోటు ఇవ్వ‌మ‌ని అడ‌గ‌ట‌మే ఓ డెలివ‌రీ బాయ్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన ఉత్తర‌ప్ర‌దేశ్ లోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. సచిన్ కశ్యప్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక పిజ్జా షాపులో పనిచేస్తున్నాడు. మరో అరగంటలో షాపు మూసేస్తారనగా.. రాత్రి 11 గంటలకు నదీమ్ బుధవారం ఫోన్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. దీంతో ఆ డెలివ‌రీ ఇవ్వ‌డానికి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సచిన్, త‌న కొలీగ్ హృతిక్ కుమార్ తో క‌లిసి వెళ్లారు. పిజ్జా ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్ద‌రూ పక్కనే ఉన్న ఒక కూల్ డ్రింక్ షాపుకు వెళ్లి కూల్‌డ్రింక్ తీసుకున్నాడు.

అయితే.. వారి ఇచ్చిన ఆ నోటు చిరిగి ఉండటంతో.. దాన్ని తీసుకోవడానికి ఆ దుకాణ‌దారు నిరాకరించాడు. ఆ నోటు న‌దీమ్ ఇచ్చాడ‌ని గుర్తించిన వారు.. వెంటనే వారిద్దరూ నదీమ్ ఇంటికి వెళ్లి.. వేరే నోటు ఇవ్వాల‌ని అభ్యర్థించారు. అలా..అడ‌గ‌డ‌మే.. నదీమ్ కు కోపం వ‌చ్చింది. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దుర్భాషలాడుకున్నారు. ఈ గొడవ విన్న అతని సోదరుడు బయటకు వచ్చి కంట్రీ మేడ్ పిస్టల్‌తో సచిన్‌పై కాల్పులు జరిపాడు. ఈ చప్పుడు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నదీమ్, అత‌ని సోద‌రుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు దేశీయ పిస్టల్స్‌, పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సచిన్ పరిస్థితి విషమంగా ఉందని, నదీమ్ సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు. 

ఈ ఘ‌ట‌న‌పై షాజహాన్‌పూర్ SHO పాండే మాట్లాడుతూ.. నిందిత సోదరులను పట్టుకోవడానికి అనేక బృందాలు ఆ ప్రాంతంలో మోహరించబడ్డాయి. వారి నుంచి రెండు దేశీయ పిస్టల్స్‌, పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాం. వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 5/25 ఆయుధాల చట్టం, 307 (హత్య ప్రయత్నం), సెక్ష‌న్ 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేసాము. ఇద్దరినీ గురువారం జైలుకు పంపామ‌ని తెలిపారు.


Scroll to load tweet…
Scroll to load tweet…